తెలుగుదేశం పార్టీలో కొంతమంది నేతలను ఇబ్బంది పెడుతున్నారు అనే వ్యాఖ్యలు మనం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా బలహీనంగా ఉన్న ఆ పార్టీలో కొంతమంది నేతలు అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీని ద్వారా పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పుడు పార్టీలో ఉండడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. తాజాగా వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎంపీ కి సంబంధించి ఒక మాజీ మంత్రి ఎక్కువగా ఫోకస్ పెట్టారని అంటున్నారు.

ఆయనకు సంబంధించిన కొన్ని ఆర్థిక వ్యవహారాలను అధికార పార్టీ నేతలకు సదరు ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఎంపీ విషయంలో ముందు నుంచి కూడా దూరంగా వ్యవహరిస్తున్న సదరు మాజీ మంత్రి... ఎంపీ గారికి సంబంధించిన వ్యాపారాలు అదేవిధంగా ఎంపీ గారికి సంబంధించిన కొన్ని ఆస్తుల వివరాలను కూడా ఆయన అధికార పార్టీ నేతలకు ఇచ్చారట. ఎంపీ గారు అవినీతి చేస్తున్నారని ఆయన మీద ఫోకస్ పెట్టాలని సూచనలు చేసారట. అయితే ఆ ఎంపీగా ఎవరు ఏంటి అనేది తెలియదు.

కానీ ఈ పంచాయతీ మాత్రం చంద్రబాబు వద్దకు వెళ్ళింది అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు కూడా సదరు మాజీ మంత్రి విషయంలో సీరియస్ అయ్యారని సమాచారం. ఎంపీ గారు అయితే అసలు తెలుగుదేశం పార్టీలో ఉండలేకపోతున్నాను అవసరమైతే బిజెపిలో వెళ్తాను అని చెప్తున్నారు అంట. వైసీపీ నుంచి కూడా ఆఫర్లు ఉన్న తాను వైసీపీలో కి వెళ్ళను కాబట్టి ఇప్పుడు బీజేపీ లోకి వెళ్ళిపోతా అని తనకు టీడీపీ వద్దని ఆయన చెబుతున్నారట. మరి భవిష్యత్తులో ఆయన ఉంటారా వెళ్ళిపోతారా అనేదానిపై అసలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే మాజీ మంత్రి మాత్రం ఎంత జరుగుతున్నా సరే తాను చేయాల్సింది చేస్తున్నారని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: