తెలుగుదేశం మీద ఇప్పుడు బాలకృష్ణ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉన్న సమయంలోబాలకృష్ణ పార్టీ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా బలోపేతం చేసే విధంగా బాలకృష్ణ అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా నాయకత్వం లోపం మీద బాలయ్య ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సమర్థ నాయకత్వం అనేది లేకుండా పోయింది. దీనితో పార్టీ అధిష్టానం కూడా చాలావరకు ఇబ్బంది పడుతోంది.

ప్రజల్లోకి వెళ్లి నాయకులు అంటూ ఎవరూ లేకపోవడంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ ఉద్యమం చేయాలి అన్న సరే ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది అనే మాట అక్షరాలా నిజం. దీనితో చంద్రబాబు నాయుడు ఇప్పుడు పార్టీని బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందుతున్నాయి. ఇటీవల జాతీయ కమిటీ ప్రకటించిన సమయంలో బాలకృష్ణ చాలా వరకు కూడా జాగ్రత్తగా వ్యవహరించారు. ఎవరికి పడితే వారికి పదవులు ఇవ్వకుండా చాలా వరకు కూడా జాగ్రత్త పడ్డారు.

ఆయన కొంత మంది పేర్లు సూచించారు. ముందు నుంచి పార్టీ కోసం పని చేసిన వారికి కీలక పదవులు ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి ముందుకు అడుగులు వేశారు. ఇక చంద్రబాబు నాయుడు కూడా దాదాపుగా బాలకృష్ణ నిర్ణయాలను కాదు అనే పరిస్థితి లేకుండా పోయింది. అయితే ఇప్పుడు నుంచి బాలకృష్ణ ఎక్కువగా యువనేతల మీద  ఫోకస్ పెట్టారని ప్రధానంగా మూడు జిల్లాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా బాలయ్య అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల మీద బాలయ్య ఎక్కువగా ఫోకస్ చేసారు అని సమాచారం. త్వరలోనే ఈ జిల్లాలో కీలక నాయకత్వాన్ని కూడా మార్చే అవకాశం ఉందని నియోజకవర్గాల ఇన్చార్జిలు కూడా కొత్తగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: