అటు తమిళ్, ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు విజయ్. ఇక తమిళ్ లో సూపర్ స్టార్  రజనీకాంత్‌, విశ్వనటుడు కమల్‌హాసన్ తర్వాత దళపతి విజయ్ కి అంత క్రేజ్ ఉంది. తాజాగా ఇళయ దళపతి' విజయ్‌ అభిమాన సంఘ నిర్వాహకులతో హఠాత్తుగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. ఆయన అభిమానులంతా సంఘాలుగా ఏర్పడి వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు. అయితే కొన్నేళ్లుగా విజయ్‌ రాజకీయాల్లో వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేకు మద్దతుగా విజయ్‌ మక్కల్‌ ఇయక్కం పని చేసినట్లు తెలిసింది. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో విజయ్‌ చేసే ప్రసంగాలు రాజకీయ ప్రకంపనలు రేపాయి. ముఖ్యంగా 'తలైవా', 'కత్తి' వంటి చిత్రాల్లో విజయ్‌ చేసిన రాజకీయ వ్యాఖ్యలు దుమారం లేపాయి. 'మెర్సల్‌' చిత్రంలో బీజేపీని, 'సర్కార్‌' చిత్రంలో అన్నాడీఎంకేను విమర్శిస్తూ వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి.

అయితే గత ఏడాది 'బిగిల్‌' చిత్ర విడుదల అనంతరం ఈ ఏడాది విజయ్‌ ఇల్లు, కార్యాలయం, చిత్ర నిర్మాతల గృహాలు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు నిర్వహించారు. కొన్ని రోజుల క్రితం విజయ్‌ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ. చంద్రశేఖర్‌ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. విజయ్‌ మక్కల్‌ ఇయక్కం భవిష్యత్తులో రాజకీయ వ్యవస్థగా మారుతుందని తెలిపారు. ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకే కూటములు, నటుడు కమల్‌హాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యం బరిలో నిలవడం ఖాయమైంది. కరోనా కాలంలో చేపట్టిన సేవా కార్యక్రమాలపై సంఘ నిర్వాహకులను అభినందించారు. అదే సమయంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పార్టీ ప్రారంభిస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇది సాధారణ సమావేశాలైనా పలు రాజకీయ విషయాలు చర్చించినట్లు సమాచారం. శాసనసభ ఎన్నికలకు ఇంకా 5 నెలలే గడువు ఉండడంతో నటుడు విజయ్‌ తన అభిమాన సంఘ నిర్వాహకులతో సమావేశాలు కావడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: