ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ను అంతం చేసేందుకు ఎన్నో రకాల ప్రత్యామ్నాయాలపై ఆధారపడుతూ ఉన్న విషయం తెలిసిందే. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి ఇప్పటి వరకు 7 నెలలు గడుస్తున్నప్పటికీ ఈ వైరస్కు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులో లేని నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కువగా ప్రత్యామ్నాయాలపై ఆశలు పెట్టుకున్నారు ప్రపంచ ప్రజానీకం. కేవలం కరోనా  వైరస్ కు సంబంధించిన మందులు మాత్రమే కాదు సాధారణ మందుల విషయంలో కూడా ప్రజల్లో  ఎంతో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే.  కరోనా  వైరస్ రాకముందు ఏ రోగానికి ఏ మందులు వాడాలి అనే విషయం దాదాపుగా ప్రజలందరికీ అవగాహన ఉండేది.


  కానీ ఇప్పుడు మాత్రం మందులపై చాలామంది అవగాహన పెంచుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎంతోమందికి మందుల వాడకం పై అవగాహన వచ్చింది. అయితే మొదట రెమిడీసివర్ యాంటీవైరల్ ఇంజెక్షన్లను కరోనా  వైరస్ చికిత్సలో కూడా వాడవచ్చు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన విషయం తెలిసిందే... ఇప్పుడు యాంటీ వైరస్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కరోనా  వైరస్ చికిత్సలో భాగంగా యాంటీవైరస్ వాడటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అంటూ ప్రకటించింది.



 అయితే ఇప్పటికీ సరైన వైద్యం అందుబాటులోకి రానున్న నేపథ్యంలో కరోనా  చికిత్సలో భాగంగా ఇలాంటి ప్రత్యామ్నాయాలు వాడితే ప్రయోజనం ఉంటుంది అనే దానిపై ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వరకు కరోనా  వైరస్ నియంత్రణకు ఇదే అసలైన మందు అని ఎవరూ చెప్పలేకపోయారు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం కరోనా  చికిత్సలో భాగంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ రెమిడీసివర్ అనే మందులను విచ్చలవిడిగా వాడేస్తున్న ఈ విషయాన్ని పరిశోధకులు గుర్తించారు.. అయితే కరోనా  వైరస్ బారిన పడినప్పటికీ రెమిడీసివర్ ను  తప్పనిసరిగా వాడాల్సిన అవసరం లేదు అని ప్రస్తుతం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరోగ్యం ఎక్కువగా క్షీణించినప్పుడు మాత్రమే రెమిడీసివర్ వాడటం వల్ల... వైరల్ లోడ్  తగ్గించడంతో పాటు మల్టిప్లికేషన్ కీ  బ్రేక్ చేస్తుందని ఊపిరి తితుల్లో  ఇన్ఫెక్షన్ తగ్గిస్తుందని చెబుతున్నారు వైద్యనిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: