విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల శ్రేయస్సే ముఖ్యమని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. కోవిడ్‌ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాలని అన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని ఆయన తెలిపారు. నవంబర్‌, డిసెంబర్‌లో మరోసారి వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందన‍్నారు. దసరా తర్వాత సెకెండ్ వేవ్‌ ఉంటుందని నిపుణులు చెబుతున్నారన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలోలాగా ఎన్నికల నిర్వహణకు ఎక్కువమందిని తరలించడం సాధ్యం కాదన్నారు. కరోనా వైరస్ మహమ్మారి రెండో దశ ప్రారంభమవుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలను కాపాడటమే ముఖ్యమని కొడాలి నాని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు శనివారం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను చెప్పిందే వేదం అనే విధంగా వ్యవహరిస్తున్నారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. నిమ్మగడ్డ రమేష్ ఇంకో మూడో, ఆరు నెలలు మాత్రమే పదవిలో ఉంటారని, ఆ తర్వాత రిటైర్డ్ అయి హైదరాబాద్‌ ఇంట్లో ఉంటారని చెప్పారు. కరోనా పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల శ్రేయస్సే ముఖ్యమని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ రమేష్ నా ఇష్టం వచ్చినట్లు చేస్తా, నేను చెప్పిందే రాజ్యాంగం అంటే కుదరదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ రమేష్ ఏమీ చేయలేరని, రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందేనని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. అలా కాకుండా ఎన్నికలు నిర్వహిస్తానంటే జరిగే పనికాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గతంలో మాదిరిగా ఎన్నికల నిర్వహణకు ఎక్కువ మందిని తరలించడం సాధ్యం కాదన్నారు. అలాగే కరోనా మహమ్మారి వల్ల ఓటేసేందుకు ఎవరూ వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అలాగే నవంబర్, డిసెంబర్ నెలల్లో మరోసారి వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారన్నారు. కాబట్టి, ప్రజారోగ్యం దృష్ట్యా ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి నాని కుండబద్దలు కొట్టారు. అయితే బిహార్ రాష్ట్రంలో కచ్చితంగా ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఉందని, రాష్ట్ర ఎన్నికలు రాజ్యాంగం ప్రకారం జరిగి తీరాల్సిందేనని పేర్కొన్నారు.

బిహార్ ఎన్నికలతో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను పోల్చకూడదన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాలని అన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని ఆయన తెలిపారు. నవంబర్‌, డిసెంబర్‌లో మరోసారి వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందన‍్నారు. దసరా తర్వాత సెకెండ్ వేవ్‌ ఉంటుందని నిపుణులు చెబుతున్నారన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలోలాగా ఎన్నికల నిర్వహణకు ఎక్కువమందిని తరలించడం సాధ్యం కాదన్నారు. ఇక బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఖచ్చితంగా జరగాల్సిన పరిస్థితి ఉందని, వాటితో స్థానిక సంస్థల ఎన్నికలు పోల్చకూడదన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందేనని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. కాగా.. గతంలో కరోనానే సాకుగా చూపించి ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ.. ఇప్పుడు వేలల్లో కేసులు వస్తున్నా ఎన్నికలు నిర్వహిస్తానని చెప్పడం విడ్డూరం.

మరింత సమాచారం తెలుసుకోండి: