ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు కరోనా నుంచి కాస్త ఊరట కలిగిందని అనుకునే లోపు మరో ఉప ద్రవం వచ్చి పడింది. అదే భారీ వర్షాలు.. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.. ఈ వర్షాలు నుంచి ప్రజలు కోలుకో లేదు. ఇప్పటికే ప్రజలు వరదల కారణంగా చాలా వరకు పోగొట్టు కున్నారు.ఇక రైతుల గురించి చెప్పాల్సిన పని లేదు చేతి కొచ్చిన పంట నీట మునగడం తో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. కరోనా వల్ల చాలా వరకు నష్టాలను చూసాము.. ఇప్పుడు వరదలు మమ్మల్ని కోలుకోలేని దెబ్బ కొట్టాయని ప్రభుత్వం దయ చూపాలని వేడు కుంటున్నారు..

మొన్న కురిసిన వర్షాలకు ఇంక వరద నుంచి కోలుకుని ప్రజలకు మరో షాక్ ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది.. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావర శాఖ తాజాగా వెల్లడించారు.నాలుగు రోజుల పాటు ఏపీలో వానలు పడతాయని అధికారులు చెబుతున్నారు. నైరుతి బంగాళా ఖాతంలో 1.5-3.1 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 4 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు.

శనివారం ఉభయ గోదావరి, రాయల సీమల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.మరో 48 గంటల పాటు నైరుతి రుతు పవనాలు నిష్క్రమించాయి..ఇక ఈశాన్య రుతు పవనాలు 28 న దేశంలోకి ప్రవేశించ నున్నాయి.ఈశాన్య రుతుపవనాల వర్షాలు కోస్తాంధ్ర, తమిళ నాడు, పుదుచ్చేరిలతో పాటు కర్ణాటక, కేరళ సరిహద్దు ప్రాంతాల్లో ఈనెల 28 నుంచే ప్రారంభం కానున్నట్టు భారత వాతావరణశాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.. ఈ సారి కురుస్తున్న భారీ వర్షాలు ఏ మేర నష్టాన్ని కలిగిస్తాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: