హైదరాబాద్ మహా నగరం ఎంత ఫేమస్ అంటే అంతకు మించి నేరాలు , క్రైమ్ రేటు కూడా పెరుగుతుంది. మెట్రో నగరంగా ఉన్న హైదరాబాద్ లో చాలా మంది ఉద్యోగాలు చేసుకుంటూ వస్తున్నారు. కుటుంబ ఫోషణకు హైదారాబాద్ నగరం చాలా సులువైన నగరం.అందుకే ఇక్కడ చాలా మంది వివిధ రకాల జాబ్ లు చేసుకుంటూ, వివిధ రకాల వ్యాపారాలను చేసుకుంటారు. అంతే విధంగా హైదరాబాద్ నేరాలు ఎక్కువే.. దోపిడీ దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు కూడా ఎక్కువే..



ఇకపోతే ఈ మధ్య ఒక వైపు కరోనా కొనసాగుతున్న కూడా, మరొక వైపు నేరాలు, అమ్మాయిల పై వరుస హత్యలు, అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.ఓటీపీ, బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి కాల్స్ చేస్తున్నామంటూ డబ్బులు కొట్టేసే వాళ్లు కొందరైతే.. ఓఎల్‌ఎక్స్‌లో వాహనాల ఫొటోలు అప్‌లోడ్ చేసి ఆర్మీ అధికారుల్లా ఫోజు కొట్టి లక్షల్లో గుంజుతున్న కేడీలు మరికొందరు. ఓఎల్‌ఎక్స్ మోసాలు భారీగా పెరిగిపోవడం తో హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ విషయాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు..



హైదరాబాద్ భరత్ పూర్ ప్రాంతంలో కొత్త రకం నేరాలను చేస్తున్నారు. మిలటరీ అధికారులమని నమ్మించి మాయ మాటలు చెప్పి.... తక్కువ రేట్లకు వాహనాలను అందిస్తామని నమ్మించి, దొరికిన కాడికి దోచుకుంటున్నారు. జస్తమర్ల నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకొని మొత్తానికి జెండా ఎత్తెస్తున్నారు..  ఏడో తరగతి పాస్ కావడం తోనే స్మార్ట్ ఫోన్ కొనడం.. ఓఎల్‌ఎక్స్ వంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. భరత్‌పూర్ జిల్లా లో సైబర్ నేరస్తులు ఉంటున్న గ్రామాలు సమస్యాత్మకమని తెలిసినా తెలంగాణ పోలీసులు  తెలివిని ప్రదర్శించారు.. పోలీసు బ్రెయిన్ ను ఉపయోగించి వారిని నేరాలకు, మోసాలకు చెక్ పెట్టారు.. స్థానిక పోలీసుల సాయంతో గ్రామాల పై దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.. దీంతో ప్రజలు ఇప్పుడు ఊపిరిపీల్చుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: