అప్పట్లో కాంగ్రెస్ ని నిలువరించి ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ ఎలాగైతే అధికారంలోకి వచ్చిందో ఇప్పుడు అదే రీతిలో వైసీపీ పార్టీ కూడా టీడీపీ ని నిలువరించి అధికారంలోకి వచ్చింది.. అయితే అల్లాటప్పాగా కాకుండా సింహం లాగ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన విధానం చూస్తే ఎంతటి శత్రువు అయినా చలించక తప్పుడు.. ఎందుకంటే ముఖ్యమంత్రి అవడానికి అయన పడ్డ కష్టం అలాంటిది.. పడ్డ కష్టం అనేకంటే పెట్టిన కష్టం అనాలి..

అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ , ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు జగన్ ను ఎంతో మానసిక ఒత్తిడి చేశారు.. అంతేకాదు తండ్రి మరణం తో క్రుంగిపోయిన జగన్ ను ఓదార్చాల్సింది పోయీ కటకటాల్లోకి నెట్టారు.. జగన్ లో ధైర్యం కోల్పోయేలా చేశారు.. కానీ ఎక్కడ తగ్గలేదు.. ఓ కొత్త పార్టీ పెట్టి సోలోగా జనంలోకి వెళ్లారు.. వారి నమ్మకాన్ని సాధించుకున్నారు.. జగన్ పార్టీ పెట్టిన తర్వాత చంద్రబాబు పెట్టిన ఇబ్బందులు అంతా ఇంతా కాదు. అయితే వాటన్నిటిని చిరునవ్వు తో ఎదుర్కుని ఈ రేంజ్ కి ఎదిగిన జగన్ ప్రయాణం అసమానీయం.. చంద్రబాబు గ్రాఫ్ ఈ రేంజ్ లో పడిపోవడానికి జగన్ ఎదిగిన తీరే నిదర్శనం..

అయితే జగన్ ని పొగిడే వారి సంఖ్య దేశంలో రోజు రోజు కి పెరిగిపోతుంది.. సీఎంగా జగన్ అందిస్తున్న పాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని గమనిస్తున్న ఇతర రాష్ట్ర పార్టీ అధినేతలు, నాయకులు జగన్ పై ఇప్పటికే ముక్త‌కంఠంతో ప్రశంశల వర్షం కురిపిస్తూ వచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని ప్రధాని మోడి కితాబు ఇస్తే, ఇలాంటి వ్యవస్థలను ఇతర రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాల్లో ప్రవేశపెడితే బాగుంటుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్ అభిప్రాయ పడ్డారు.సీఎం జగన్ పరిపాలన విధానం , ప్రజలకి అందిస్తున్న సంక్షేమాన్ని ప్రశంసిస్తూ తమిళనాడు రాజకీయ పార్టీ పీఎంకే చీఫ్ రాందాస్ ఆసక్తికర వాఖ్యలు చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: