ఇప్పటికే తెలంగాణాలో పుంజుకున్న బీజేపీ పార్టీ ఏపీ లో కూడా సోము వీర్రాజు అధ్యక్షతన రోజు రోజు కి కొంత బలపడుతున్న సంగతి తెలిసిందే.. సోము పదవి చేపట్టాక ప్రజల్లోకి బీజేపీ పార్టీ వేగంగా దూసుకెళ్లింది.. ముఖ్యంగా టీడీపీ వీక్ గా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది.. కేంద్రంలో అధికారంలో ఉన్నా అక్కడ సపోర్ట్ సరిగ్గా లేకపోయినా రాష్ట్రంలో తామే అధికారంలో ఉన్న పార్టీ మాదిరి సోము ఏపీ లో బీజేపీ బలోపేతానికి చాలా చర్యలు చేపట్టి అందులో సక్సెస్ అయ్యాడని చెప్పాలి.. రాష్ట్రంలో గతంలో ఏ బీజేపీ లీడర్ చేయని విధంగా బీజేపీ బలోపేతానికి కృషి చేశారు సోము..

ఇప్పుడు ప్రజల నమ్మకం విషయంలో టీడీపీ కంటే ముందుగా ఇప్పుడు బీజేపీ పార్టీ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. రాష్ట్ర బీజేపీ పరిస్థితి ఇలా ఉంటే ఎపి విషయంలో సెంట్రల్ లోని బీజేపీ పరిస్థితీ వేరేలా ఉంది.. ఇన్నాళ్లు తమతో కలిసి వచ్చిన చాలా ప్రాంతీయ పార్టీ లు ఇప్పుడు మోడీ కి కొంత వ్యతిరేకమయ్యాయి.. ఎప్పుడు ఏ పార్టీ ఊడిపోతుందో అర్థం కావట్లేదు.. అందుకే వైసీపీ సపోర్ట్ కోసం మోడీ కొంత ఇంట్రెస్ట్ ను జగన్ పై పెడుతున్నారు.. అందుకే రాష్ట్ర బీజేపీ కంటే వైసీపీ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు మోడీ.. ఇక తిరుపతి ఉప ఎన్నికల విషయంలో కొంత ఉత్కంఠ నెలకొంది..

ఇప్పటికే టీడీపీ ఈ పోటీ నుంచి తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో వైసీపీ , బీజేపీ లకు పోరు తప్పదనిపిస్తుంది. ఈనేపథ్యంలో బీజేపీ పొరుగు పార్టీ నుంచి ఇక్కడి అభ్యర్థి ని తీసుకుని రావడం పార్టీ కార్యకర్తలను కొంత అసహనానికి గురి చేస్తుంది.. ఇక్కడ బలమైన అభ్యర్థి ఎవరా అని ఆలోచించి.. చివరికి.. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన మాజీ కాంగ్రెస్ నేత పనబాక లక్ష్మి వైపు మొగ్గు చూపినట్లుగా చెబుతున్నారు.  టీడీపీ, వైసీపీ పార్టీ ఆమె వైపు చూడకపోవడంతో బీజేపీ ఆమెను చేర్చుకోవాలని అుకుంటోంది. జనసేన మద్దతు ఉంటుందని… తిరుపతి పార్లమెంట్ పరిధిలో పవన్ ఫ్యాన్స్ ఎక్కువే ఉంటారని బీజేపీ భావిస్తోంది. మరి ఈ అభ్యర్థి బీజేపీ కి విజయం చేకూరుస్తాడా చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: