జగన్ పాలన ఎలా ఉందంటే ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు.. వారు టీడీపీ లో ఎదుర్కున్న కష్టాలు ఏమాత్రం ఎదురుకోవడంలేదని వారే స్వయంగా చెప్తున్నారు..  అయితే వెన్నుపోటు తో ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు కు, స్వయం కృషి తో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కు తేడా ఉంది.. వైస్ జగన్ సీఎం అవడానికి పదేళ్లు కష్టపడ్డారని ఎవరినడిగినా చెప్తారు.. ఎలాంటి రాజకీయ బలం లేని వేళా ఒంటరిగా ప్రజల అండతో జగన్ పార్టీ పెట్టి ప్రజల్లోకి దూసుకుపోయారు.. ఒకసారి ఓడిపోయామని కృంగిపోకుండా రెండో సారి ప్రయత్నం చేశారు..

అయితే రెండో సారి సారి మాత్రం అత్యధిక మెజారిటీ తో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు.రాష్ట్రానికి అన్ని తానే అని చెప్పుకునే చంద్రబాబు కు ప్రజలు తగిన బుద్ధి చెప్పడమే కాదు సరైన నాయకుడిని ఎన్నుకున్నామనే భావం కూడా ఉంది.. అయితే జగన్ ఇంత స్థాయి కి రావడానికి అయన ఒక్కరి కృషి ఉందంటే ఎవరు ఒప్పుకోరు.. ఎందుకంటే అయన గెలవడానికి ముఖ్య కారణం ప్రజలు అయితే ప్రధాన కారణం అయన వెన్నంటి ఉన్న కొంతమంది నేతలు, కార్యకర్తలు.. వీరు ఎలాంటి స్వార్ధం లేకుండా జగన్ కోసం, పార్టీ కోసం పనిచేసిన వారే..  అందుకే ప్రజలకు ఎక్కడా ఏ లోటు లేకుండా చూసుకున్నారు జగన్..

ఇక తాజాగా దసరా కానుకగా జగన్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. డీఏల చెల్లింపునకు కార్యాచరణ కూడా ప్రభుత్వం ప్రకటించింది. జులై 2018 నాటి మొదటి డీఏను జనవరి జీతాల్లో చెల్లించాలని ఆదేశించారు. జనవరి 2019 నాటి రెండో డీఏను 2021 జులై జీతాల్లో చెల్లిస్తారు. జులై 2019 నాటి మూడో డీఏను 2022 జనవరి నుంచి చెల్లిస్తారు. సీఎం జగన్ నిర్ణయంతో 4.49 లక్షల ఉద్యోగులు, 3.57 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: