కనక దుర్గ అమ్మవారికి పూజలు చేసినందుకే అమ్మవారు మంగయ్యకు కూతురిగా ఆ కుటుంబానికి వచ్చిందని... తిరిగి అమ్మవారిలో ఐక్యమైపోయిందని స్థానికులు నమ్ముతారు. అయితే, కాల క్రమంలో బ్రిటీష్‌ పాలకుల హయాంలో సైనికుడైన మంగయ్య ఇల్లు పోలీస్‌ స్టేషన్‌గా మారిపోయింది. అయితే, దుర్గమ్మవారికి సారె పంపే సంప్రదాయం వందల ఏళ్లుగా కొనసాగూ వస్తోంది. 1910లో వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణం జరిగింది. బ్రిటీష్‌ అధికారి రాబర్ట్‌ హేన్స్‌ హయాంలో స్టేషన్‌ నిర్మించినప్పుడు... అమ్మవారి చర్రితను తెలిపే శిలా శాసనం కూడా ఏర్పాటు చేశాడు. నెమలి బొమ్మతో గల ఈ శిలాశాసనంపై పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభించిన అధికారుల పేర్లు, మేజిస్ట్రేట్‌ పేరు చక్కగా ఇంగ్లీష్‌లో చెక్కించారు. అయితే... బ్రిటీష్‌ వాళ్లు నిర్మించి పోలీస్‌ స్టేషన్‌ శిథిలావస్తకు చేరుకోవడంతో దానిని కూల్చి... అక్కడ కొత్త భవనం కట్టారు. ఈ క్రమంలో శిలాశాసనం కూడా కనుమరుగైపోయింది.


దేవాదాయ-ధర్మాదాయ శాఖ ఏర్పాటయ్య వరకూ అమ్మవారికి నిత్యం వన్‌టౌన్‌ పోలీసులే పూజలు చేసే వాళ్లు. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మ ఉగ్రరూపంలో ఉండే వారు. కాళికా రూపంలో భయంగొలిపేలా ఉండడం వల్ల భక్తులు తనను చూసి భయపడకుండా కొండ దిగేవారు కాదు అమ్మవారు. అయితే, ఆదిశంకరాచార్యులు అమ్మవారిని శాంతింపజేసి... శాంతి దుర్గమ్మగా మార్చారని చెబుతారు.  అంతేకాదు... అమ్మవారిని అష్టదిగ్బంధం చేయడానికి వేసిన సిరి చక్రం కూడా ఇంద్రకీలాద్రిపై ఉంది. కళియుగంలో భక్తులు నీ దగ్గరకు నడుచుకుంటూ వస్తారు కానీ... నువ్వు కిందకు దిగాల్సిన అవసరం లేదని ఆదిశంకరాచార్యులు అమ్మవారికి విన్నవించినట్టు పలు శాసనాలను బట్టి తెలుస్తోంది.

కాలక్రమంలో కనుమరుగైపోయిన అమ్మవారి గురించి సైనికుడైన మంగయ్య వల్ల అందరికీ తెలిసింది. ఒకప్పుడు గ్రామానికి కాపలాకాసిన సైనికుడి స్థానంలో పోలీస్‌ వ్యవస్థ రావడంతో... అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పోలీసులకు భాగస్వామ్యం లభించింది. ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. మొత్తానికి మంగయ్య ఇల్లే పోలీస్ స్టేషన్ కావడం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: