పోలవరం నిర్మాణం లో పొరపాట్లు జరిగాయంటూ... అన్యాయం జరిగిందంటూ మండిపడ్డాడు ఒక రాజకీయ ప్రముఖుడు.. నిర్మాణంలో తప్పులు లెక్కపెడుతూ వారు వీరు అని తేడా లేకుండా చేసినవారే సరిదిద్దుకోవాలి అన్నారు. ఇంతకీ ఈ మాటలు అన్నది మరెవరో కాదు...బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. బెజవాడలో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ పోలవరం నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించారు... కానీ ఇది కేవలం ఆరోపణ కాదని జరిగిన సత్యమని.... కావున లోటుపాట్లను గుర్తించి వెంటనే సరి చేయాలని తేల్చి చెప్పారు. అవినీతి జరిగిందని చెప్పడంలో అనుమానమే లేదని హాట్ కామెంట్స్ చేసారు. అంతేకాకుండా గతంలో కేంద్ర మంత్రి గడ్కరీకి కూడా  ఇదే విషయంపై ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.

ఈ విషయాన్ని ఇంతటితో వదిలేది లేదని ..... ఏదేమైనా ముందుకు తీసుకెళ్లాలని,పోలవరం అంచనాల పెంపుపై విచారణ జరగాలని వాస్తవ అంచనాలకు అనుగుణంగానే కేంద్రం నిధులు ఇస్తుందని చెప్పారు ఎమ్మెల్సీ మాధవ్. అయితే ఈ ఘాటు వ్యాఖ్యలు వెనక... అసలు కారణం ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసినందు వల్లే..... దాని ఫలితంగా ఇప్పుడు ఇలా ఆయన ఈ కౌంటర్ ఇచ్చినట్టు టాక్..... అందుకే ఎవరికి అర్థం కావాలో వారికి అర్థం అయ్యేలాగా మాధవ్ బాణాలు బాగానే తగిలాయి అంటూ చర్చించుకుంటున్నారు రాజకీయవర్గాల ప్రముఖులు.

ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తన  ప్రసంగానికి మరింత బలం చేకూర్చారు....  దేశ ప్రజల కోసమే బీజేపీ పుట్టిందన్నారు. ప్రజల సంక్షేమమే మా లక్ష్యం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత  ప్రతీ కార్యకర్త మీదా ఉందంటూ బాధ్యతను గుర్తు చేశారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, జీవీఎల్ తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: