జగన్ కేసీయార్ ఇద్ద‌రూ మంచి మిత్రులు అని అందరూ అంటారు. గత ఏడాది అధికారంలోకి జగన్ వచ్చారు. చాన్నాళ్ళు ఇద్దరి మధ్యన స్నేహం సాగింది. ఇద్దరు అన్నదమ్ములుగా మెలిగారు. అయితే కొన్నాళ్ల తరువాత ఇద్దరి మధ్యన మాటలు లేకుండా పోయాయి. అది ఎంతవరకూ వచ్చింది అంటే దసరా వేళ తెలంగాణా నుంచి ఆంధ్రా వచ్చేందుకు కూడా బస్సులు రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోలేనంతగా. అంతర్రాష్ట్ర రవాణా విషయంలో రెండు ప్రభుత్వాలూ చర్చలు జరుపుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. ఇవన్నీ ఇలా ఉంటే ఇద్దరు నేతల మధ్య రోజు రోజుకూ వివాదాలు ముదిరిపోతున్నాయి. అసలే జల వివాదాలు కూడా ఉన్నాయి.

ఇక మరోవైపు జగన్ కేంద్రంలో సత్సంబంధాలు నెరుపుతున్నారు. అది టీయారెస్ కి కంటగింపుగా మారిందని అంటారు. కేంద్రం ఈ మధ్య కొత్తగా వ్యవసాయ చట్టాలు చేసింది. రైతులు వాడే విద్యుత్ కి మీటర్లు బిగించమని కూడా కేంద్రం పేర్కొంది. దాన్ని ఏపీలో జగన్ అమలు చేస్తున్నారు. తెలంగాణాలో మాత్రం కేసీయార్ వ్యతిరేకిస్తున్నారు. తాజాగా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రైతుల గొంతు ఏపీ సీఎం జగన్ లా తాము కోయమని హాట్ కామెంట్స్ చేశారు. అంతకు ముందు కూడా ఆయన జగన్ని ఇలాగే  టార్గెట్ చేశారు.

మరో వైపు తెలంగాణా బీజేపీ నాయకులు జగన్ని పొగుడుతున్నారు బీజేపీ తెలంగాణా ప్రెసిడెంట్ బండి సంజయ్ అయితే వైసీపీ జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తే తీసుకుంటామని చెప్పారు. అంటే తెలంగాణాలో జగన్ కి ఉన్న చరిష్మా, వైసీపీకి ఉన్న ఓటు బ్యాంక్ తమ వైపు మళ్ళించాలని బీజేపీ కోరుతోంది. కేసీయార్ జగన్ ల మధ్య సంబంధాలు బెడిసిన నేపధ్యంలో కొత్త పొత్తులు ఏమైనా కుదురుతాయా అన్న చర్చ అయితే వస్తోంది. నిజంగా జగన్ కేసీయార్ కి వ్యతిరేకంగా ముందుకు వెళ్తారా అన్న ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: