శక్తివంతులైన నాయకుల్లో భారత ప్రధాని ఎప్పుడూ ముందు వరుసలో వుంటారు. కరోనా గడ్డుకాలంలో కూడా దేశాన్ని నిలబెట్టాడంటే ఆయనకు ఆయనే సాటి. మోడీ ప్రవేశపెట్టిన కార్యక్రమాలలో మన్ కీ బాత్ ఒకటి. ఇందులో భాగంగా మోడీ ఖద్దర్ బట్టల ప్రస్తావన తెచ్చిన విషయం అందరికీ తెలిసినదే. మన్ కీ బాత్ కార్యక్రమంలో తాజాగా మాట్లాడుతూ దేశంలో ఖాదీ బట్టలకు డిమాండ్ పెరుగుతున్నట్లు చెప్పారు. ఆత్మనిర్భర్ లోకల్ టు వోకల్ ప్రోగ్రాములకు అసలు సిసలైన నిర్వచనంలా మారిందని అన్నారు.

మెక్సికోలోని ఒహాకా ప్రాంతంలో స్ధానిక మెక్సినక్ బ్రౌన్ రకం ఖద్దర్ ను ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. కాగా ఇది చాలా మేలైన రకానికి చెందినదని అన్నారు. కరోనా గడ్డు కాలంలో ఖాదీ వస్త్రాలతో చేసిన మాస్కులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని అన్నారు. స్వయం సహాయక బృందాల్లోని మహిళలు ప్రతిరోజు వేలాది ఖద్దర్ మాస్కులను తయారు చేస్తున్నట్లు మోడి ఈ సందర్భంగా గుర్తు చేసారు.

ఇక అమెరికాలోని చిన్మయ్ పాఠంకర్ మల్ల యోధులను తయారు చేస్తున్న విషయాన్ని మోడి ఈ సందర్భంగా గుర్తు చేసారు. భారత్ తరహా మల్ల యుద్ధంపై అమెరికాలోని యువత ఆసక్తి చూపటం పట్ల మోడీ మిక్కిలి సంతోషం వ్యక్తం చేశారు. భారతీయులు విస్మరించిన మల్లకంబంను అమెరికా యువత నేర్చుకోవటం చూసి మనం సిగ్గుపడాలని, మన దేశ యువకులు అందరూ తప్పనిసరిగా ఈ విద్య నేర్చుకోవాలని సూచించారు.

తమిళనాడుకు చెందిన తిరువక్కురళ్ ను దేశంలోని ప్రతి ఒక్కరు చదవాలని మోడి తెలిపారు. అయితే అసలు తిరువక్కురళ్ అంటే ఏమిటి ? దేశంలోని మిగితా ప్రాంతాల వాళ్ళు ఎందుకు చదవాలో మాత్రం మోడి చెప్పక పోవడం గమనార్హం. తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన పొన్ మరియప్పన్ను మోడి తమిళంలోనే పలకరించడం కొత్తదనాన్ని సంతరించుకుంది. ప్రసంగం ముగిస్తూ... దసరా పండుగ రోజున బజారుకి వెళ్లాలంటే కూడా పరిస్ధితిలు అనుకూలించకపోవటం చాలా బాధాకరం అని అని ముగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: