తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళే నేతలు ఎవరు అనే దానిపై చాలా చర్చలు రాజకీయ వర్గాలలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా కొంతమంది కీలక నేతలు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి బిజెపిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినబడుతున్నాయి. అయితే ఎవరు వెళ్తారు ఏంటి అనే దానిపై మాత్రం ఒక క్లారిటీ లేదు. త్వరలోనే టిఆర్ఎస్ పార్టీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు బిజెపిలోకి వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని కొంతమంది వ్యాఖ్యానించారు. అయితే తుమ్మల మాత్రం ఇప్పుడు ఎటు చెప్పకుండా సైలెంట్ గా ఉంటున్నారు.

అటు కొడుకు కూడా పెద్దగా రాజకీయాల మీద ఆసక్తి చూపించక పోవడంతో ఆయన కూడా ఇప్పుడు ఏ పార్టీలో కి వెళ్ళకుండా సైలెంట్ గా ఉంటున్నారు. అయితే తుమ్మల విషయంలో మాత్రం ఇప్పుడు బీజేపీ కాస్త ఎక్కువగానే కష్ట పడుతుందని తెలుస్తుంది. బీజేపీ రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్ రావు ద్వారా ఆయనతో చర్చలు జరుపుతున్నారు. అయితే గరికపాటి మాత్రం ఆయనను తీసుకోలేకపోతున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనితో తుమ్మల నాగేశ్వరరావుతో సన్నిహితంగా ఉన్న ఒక ఆంధ్ర రాజ్యసభ ఎంపీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఆయన కూడా ఇప్పటికే తుమ్మల నాగేశ్వర రావుతో భేటీ అయ్యారని హైదరాబాదులో కలిశారని అంటున్నారు. అయితే ఆయన మాత్రం టిఆర్ఎస్ పార్టీలో ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. అయితే తుమ్మలకు మాత్రం జాతీయ స్థాయిలో ఇచ్చే పదవిపై హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఆయన వస్తే కచ్చితంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా బీజేపీ లోకి వస్తుంది అని టాక్.  ఎప్పుడు వస్తారు ఏంటి అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ తుమ్మల నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: