సైనిక సంసిద్ధత విషయంలో చైనా కంటే భారతదేశం మరింత శక్తివంతంగా ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం అన్నారు. సంఘ్ వార్షిక విజయదశమి ర్యాలీలో భగవత్ మాట్లాడుతూ, చైనాకు వ్యతిరేకంగా భారతదేశం సైనికపరంగా మెరుగ్గా సిద్ధం కావాలని ఆయన అన్నారు. కోవిడ్ -19 మార్గదర్శకాల కారణంగా 50 'స్వయం సేవకులు' మాత్రమే ఈ ఈవెంట్ కి హాజరు అయ్యారు. ఇప్పుడు చాలా దేశాలు చైనాకు అండగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు.

మన భూభాగాలను ఆక్రమించుకునే చైనా ప్రయత్నాలకు మా రక్షణ దళాలు, ప్రభుత్వం మరియు ప్రజలు తీవ్రంగా స్పందించారని ఆయన అన్నారు.  ఇది ఏ పరిస్థితికి దారి తీస్తుందో తెలియదని ఆయన అన్నారు. కాబట్టి ముందుకు వెళ్ళే మార్గం విషయంలో అప్రమత్తంగా మరియు సిద్ధంగా ఉండాలన్నారు. సైనిక సంసిద్ధత, ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ సంబంధాలు మరియు పొరుగు దేశాలతో సంబంధాల విషయంలో చైనా కంటే మనం శక్తివంతంగా ఉండాలి అని ఆయన అన్నారు.
 
నేపాల్, శ్రీలంక, తదితర పొరుగు దేశాలతో ప్రభుత్వం... చైనా పోరాటం చేయడానికి కలిసి వెళ్ళాలి అని ఆయన సూచించారు.  కరోనా మహమ్మారి సమయంలో చైనా మన సరిహద్దులను ఆక్రమించింది అని ఆయన చెప్పుకొచ్చారు. తైవాన్, వియత్నాం ని చైనా ఆక్రమించింది అని ఆయన ఆరోపించారు. “మనము అందరితో స్నేహంగా ఉండాలని అనుకుంటున్నాము. ఇది మన స్వభావం. కానీ మన విషయంలో ఎన్నో కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. భారతదేశం హిందూ దేశం అన్నారు. హిందూస్తాన్ హిందూ దేశం అని ఆర్ఎస్ఎస్ అని చెప్పింది అంటే దాని మనస్సులో రాజకీయ భావన లేదు అని ఆయన స్పష్టం చేసారు. హిందుత్వ అనే  పదాన్ని కొంత మంది వక్రీకరించారు అని ఆయన ఆరోపించారు. సియెఏ విషయంలో ఎవరికి నష్టం ఉండదు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: