ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలలో ఇప్పుడు ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు అసలు ఇప్పుడు ఏం జరుగుతుందోనని కంగారుపడుతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో వైసిపి సర్కారు అనుసరిస్తున్న దూకుడు కూడా ఇప్పుడు కొంత మందిని బాగా భయపెడుతోంది. ముఖ్యంగా అక్రమకట్టడాల విషయంలో వైసీపీ సర్కార్ చాలా దూకుడుగా వెళ్లడంతో అసలు ఏం చేయాలో అర్థంకాని స్థితిలోకి తెలుగుదేశం పార్టీ నేతలు వెళ్లిపోయారు.

ప్రస్తుతం అక్రమ కట్టడాలు విషయంలో సీఎం జగన్ చాలా సీరియస్ గా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. అక్రమ కట్టడాలు ఎవరివి అయినా సరే కూల్చేస్తాను అని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా గీతం యూనివర్సిటీ ని టార్గెట్ చేసింది ఏపీ సర్కార్. త్వరలోనే మరికొంత మంది నేతలను టార్గెట్ చేసే అవకాశం ఉందని వ్యాఖ్యలు వినబడుతున్నాయి. ఇటీవల సబ్బం హరి ని టార్గెట్ చేస్తూ అక్రమ కట్టడాలు కూల్చేసింది ఏపీ సర్కార్. దీంతో అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు.

ఇప్పటికే చంద్రబాబు వద్దకు కొంతమంది భయపడుతూ వెళ్లినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే తాము పార్టీ మారతామని ఇప్పుడు  ఏమి చేయలేని స్థితిలో ఉన్నామని అర్థం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు వద్ద కొంత మంది నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కూడా వారికి ఏమీ చెప్పలేక సరే అన్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే కొంతమంది నేతలు పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎవరైతే భయపడుతున్నారో వారు అందరూ కూడా మంత్రుల ద్వారా రాజి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని వారందరూ ఇప్పుడు వైసీపీలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు. మరి అక్రమ కట్టడాలు విషయంలో ఎవరినీ టార్గెట్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: