గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం కోసం ఎంత కష్టపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు అక్కడున్న నేతలు మాత్రం ఆ పార్టీకి సహాయ సహకారాలు అందించడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఈ తరుణంలో వస్తున్న కొన్ని వార్తలు టిఆర్ఎస్ పార్టీ లో కాస్త జోష్ నింపుతున్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.  అసలు ఏంటి ఆ వార్తలు అనేది చూస్తే... కాంగ్రెస్ లో వర్గ విభేదాలు కారణంగా చాలామంది నేతలు పార్టీని వీడి బయటకు వచ్చి ఆలోచనలో ఉన్నారట.

వారందరూ కూడా టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వారితో పాటు బీజేపీ నేతలు కూడా కొంత మంది వరకు విభేదాలతో ఇబ్బందులు పడుతున్నారని టాక్. వారు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే అయితే హైదరాబాదులో చాలా ఇబ్బంది పడుతున్నారని, దీంతో ఆయన పార్టీ మారడానికి చాలా వరకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. అంతేకాకుండా మాజీ మంత్రి కూడా ఒకరు ఇప్పుడు పార్టీ మారడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది.

అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఎల్ రమణ అధ్యక్షుడు కావడంతో ఇష్టంలేని చాలామంది నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి అన్ని విధాలుగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీరందరూ కూడా పార్టీ మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుంది ఏంటి అనేది చూడాలి. ఇక ఇప్పుడు వస్తున్న మరి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ఎక్కువగా వ్యాఖ్యలు వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: