మహాత్మా గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. మహాత్మా గాంధీ గారు  గుజరాత్ లోని పోరుబందర్ లో జన్మించారు.
మహాత్మా గాంధీ గారికి భారతరత్న ఎందుకు ఇవ్వలేదు?శ్రీ అంబేద్కర్ గారికి ఇచ్చారు , శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్  గారికి ఇచ్చారు. మరి మహాత్మా గాంధీ గారికి ఎందుకు ఇవ్వలేదు? ఈ ప్రశ్న నా మెదడును కొరికేస్తుంది. నేను పదవ తరగతిలో ఉన్నపుడు అనుకునే వాడిని గాంధీ గారికి ఖచ్చితంగా భారతరత్న ఇస్తారు అని,  అప్పుడు నా వయసు పదిహేను సంవత్సరాలు . పది సంవత్సరాలు దాటింది మహాత్మా గాంధీ గారికి అవార్డు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అని తెలుసుకోడానికి నాకు పదేళ్ల సమయం  పట్టింది.. దేశం కోసం ఎంత చేశారే భారతరత్న ఎందుకు ఇవ్వలేదు అని లోలోపల అనుకునేవాడిని .

కానీ ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏమిటంటే
భారతరత్న అనేది దేశంలోనే అత్యున్నత పురస్కారం. మహాత్మా గాంధీ అంతకంటే అత్యున్నతమైన వ్యక్తి  మహాత్మా గాంధీ మరియు భారతరత్న ఇవి రెండూ పక్కపక్కన పోల్చలేం. ఆలా పోల్చడం కూడా సరి కాదు భారతదేశం మహాత్మా గాంధీ ని భారతరత్న కంటే గొప్పదిగా భావించింది. అందుకే మహాత్మా గాంధీ  జాతిపిత అయ్యారు. కరెన్సీ పైకి వచ్చారు.అంతటి గొప్ప స్థానం ఇచ్చిన మన భారతదేశం ఆ గొప్ప స్థానం ముందు భారతరత్న అనేది చాలా చిన్నది అని నా అభిప్రాయం . ఒకవేళ గాంధీ గారికి భారతరత్న ఇచ్చి ఉంటే అతడు చేసిన దానికి వెలకట్టి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి గాంధీ గారు చేసిన పనిని భారతదేశం వెలకట్టలేదు. అతడు చేసిన పనిని గొప్పదిగా కీర్తించింది .  

మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం కోసం అహర్నిశలు పాటుపడ్డారు. భారత ప్రజలను సంఘటితం చేసి ఆంగ్లేయుల పైకి బాణాల్లా ఉద్యమాల రూపంలో వదిలారు.ఈ ఉద్యమాలలో ఎంతమంది మరణించిన గాంధీ గారు వెనకడుగు వేయలేదు.  కాబట్టి స్వేచ్ఛ స్వాతంత్రం కోసం అహర్నిశలు పాటుపడిన మహాత్మా గాంధీ గారితో భారతరత్న ని వెలకట్టలేము. చివరికి గాంధీ గారు భారతరత్నకు అర్హుడా కాదా అని అంటే భారతరత్న కంటే ఎక్కువ అర్హతలు కలిగి ఉన్న మహోన్నతమైన వ్యక్తి మన జాతిపిత శ్రీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.

మరింత సమాచారం తెలుసుకోండి: