గవర్నర్ ని కూడా వదలని కరోనా వైరస్.... bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా  పాజిటివ్‌ వచ్చినట్లు ఆయనే స్వయంగా సామాజిక మాధ్యమం ద్వారా తెలియచేసారు. అలాగే తాను ఉన్న పరిస్థితుల గురించి వివరించారు. ఇప్పటికి తనకు ఎలాంటి వ్యాధి లక్షణాలూ లేవని, ప్రస్తుతానికి ఆరోగ్యం  అంతా బాగానే ఉందని ఆయన తెలిపారు. ఊపిరి అందకపోవడం ... లేదా  తీవ్రమైన జ్వరం వంటి  ఎటువంటి లక్షణాలు పెద్దగా లేవని పేర్కొన్నారు.

వ్యాధి లక్షణాలు పెద్దగా లేనప్పటికీ.... స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు వెల్లడించారు. అంతేకాదు తనను ఇటీవల కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదని శక్తికాంత దాస్‌ సూచించారు. ఇక వృత్తి విషయానికి వస్తే.. ... స్వీయ నిర్బంధంలో ఉంటూనే తన కార్యకలాపాలు కొనసాగించనున్నట్లుగా తెలిపారు. ఆర్‌బీఐ యథావిధిగా పనిచేస్తుందని చెప్పారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు, ఇతర అధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌, టెలిఫోన్ల ద్వారా అందుబాటులో ఉంటానని సోకాయల్ మీడియా ద్వారా శక్తికాంత దాస్‌ వివరించారు.

 ప్రస్తుతం కరోనా వైరస్.... ప్రపంచమంతటా చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్... ప్రస్తుతం దీని తీవ్రత తగ్గిందా లేక పెరిగింద అనే డైలమాలో ప్రజలంతా ఉన్నారు.... కొందరు కరోనా నే లేదు పూర్తిగా అంతరించిపోయింది అంటుంటే మరికొందరు వైరస్ ఉంది కానీ ముందులా వేగంగా వ్యాప్తి చెందడం లేదు అంటున్నారు.... నిజానికి కరోనా వైరస్ అంతరించిపోలేదు కానీ  గతంతో పోలిస్తే వ్యాప్తి వేగం కాస్త తగ్గిందనే చెప్పాలి. దీనికి కారణం ప్రజల్లో పెరిగిన అవగాహనే.... అయినా కొంత మంది ఎత్తు నిర్లక్ష్యంగా ఇప్పటికీ మాస్కులు లేకుండా జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశంలో తిరుగుతూనే ఉన్నారు... ఇలా చేయడం వలన తిరిగి మళ్ళీ కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగించే అవకాశం  లేకపోలేదు కాబట్టి ముందుగానే అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవడం అన్నింటికంటే ఉత్తమం.


మరింత సమాచారం తెలుసుకోండి: