టిడిపి అధినేత చంద్రబాబు విషయానికి వస్తే ఆయన ప్రతి విషయంలోనూ హైలెట్ అవ్వాలి అని చూస్తారు. క్రెడిట్ వేస్తే తమ ఖాతాలోనే చేసుకుంటూ తన పరపతిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అయినా , ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అయినా బాబు వైఖరి లో మాత్రం ఎప్పుడు మార్పు లేదు సరికదా, ఇలాగే ఉంటుంది. అందుకే టిడిపి క్యాడర్ ఎవరు అధికారంలో ఉన్న సమయంలోనూ తమకు పెద్ద పెద్ద పదవులు వస్తాయని నమ్మకాన్ని పెట్టుకోరు . దీనికి కారణం బాబు వైఖరి వారికి స్పష్టంగా తెలియయడమే.



 ఇక 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీని పెద్దగా చేపట్టలేదు. అరకొరగా నియామకాలు చేపట్టారు. అది ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ఇచ్చిన హామీ కారణంగా మాత్రమే వాటిని భర్తీ చేశారు. కానీ మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న నేతలు ఎవరికి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత దక్కలేదు. అయితే ఏపీ సీఎం జగన్ విషయానికి వస్తే, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ వస్తున్నారు. తాజాగా 56 బిసి కార్పొరేషన్ చైర్మన్ లు, 672 డైరెక్టర్ పోస్టులను పార్టీ నాయకులతో చేశారు. దీంతో వైసిపి పై బీసీల్లో మరింతగా సానుకూలత ఏర్పడింది అనే  విషయాన్ని స్వయంగా టిడిపి నాయకులే చెబుతున్నారు.


తమ అధినేత చంద్రబాబు నామినేటెడ్ పోస్టుల భర్తీపై పెద్దగా దృష్టి సారించేవారు కాదని, కానీ జగన్ చాలా ధైర్యంగా చేయడం సాహసమే. ఈ విషయంలో జగన్ అభినందించాల్సిందే అంటూ వారు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.తమ అధినేత చంద్రబాబు చేయలేనిది, జగన్ చేసి చూపించారని ఒప్పుకుంటున్నారు.అయితే మరికొందరు మాత్రం, గతంతో పోలిస్తే చంద్రబాబు వైఖరి లో మార్పు కనిపిస్తోందని, తాజాగా చేపట్టిన పార్టీ పదవుల్లో సామాజిక వర్గాల సమకూర్పు చూస్తేనే ఇది అర్థమవుతుందని వెనకేసుకొస్తున్నారు. ఏదిఏమైనా జగన్ వ్యవహారంలో టిడిపి నాయకులు సైతం సానుకూలత వ్యక్తం చేయడం గొప్ప విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: