బిగ్ న్యూస్ : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,997 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,07,023కి చేరింది. ఇందులో 30,860 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,69,576 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 21 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,587కు చేరుకుంది. ఇక నిన్న 3,585 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 108, చిత్తూరు 466, తూర్పుగోదావరి 254, గుంటూరు 301, కడప 153, కృష్ణా 358, కర్నూలు 67, నెల్లూరు 96, ప్రకాశం 340, శ్రీకాకుళం 86, విశాఖపట్నం 187, విజయనగరం 89, పశ్చిమ గోదావరి 492 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,13,360కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 765 మంది కరోనాతో మరణించారు.ఇది ఇలా ఉండగా,,,మార్చి 1 నుంచి ఆగష్టు 31 మధ్యలో రుణాలపై చక్రవడ్డీని విధించకూడదని సుప్రీం కోర్టు ఇప్పటికే తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో లాక్‌డౌన్‌ సమయంలో ఎవరైతే మారటోరియంను వినియోగించకుండా లోన్లను సకాలంలో చెల్లించారో.! వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లింపు,  క్యాష్‌బ్యాక్‌ ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది... రూ. 2 కోట్ల వరకు రుణాలు తీసుకున్న చిరు వ్యాపార సంస్థలు, వ్యక్తిగత రుణగ్రహీతలకు దాని ఫలాలు అందుతాయని తెలిపింది.

వాణిజ్య, సహకార బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రోఫైనాన్స్ సంస్థలతో సహా bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నియంత్రితలో ఉన్న మనీ లెండర్స్‌ అన్నింటికీ ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా పలు గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది. ఆరు నెలల వడ్డీ-చక్రవడ్డీకి మధ్య వ్యత్యాసాన్ని మారటోరియం సమయంలో ఈఎంఐలు చెల్లించినవారికి క్యాష్‌బ్యాక్‌ రూపంలో నవంబర్ 5వ తేదీలోగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.....

మరింత సమాచారం తెలుసుకోండి: