విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూనే వస్తోంది. ముందు నుంచి గంటా వైసీపీలోకి వస్తాడంటూ, పెద్దఎత్తున ప్రచారం జరిగినా, ఆయనను చేర్చుకునేందుకు జగన్ ఇష్టట పడకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. కానీ ఆయన అయిష్టంగానే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు వైసీపీలోకి వెళ్లేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. స్వతహాగా రాజకీయ విశ్లేషకుడు గా  పేరున్న గంటా శ్రీనివాసరావు, 2024 ఎన్నికల్లోనూ మళ్లీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని గట్టి నమ్మకంతో నే ఉన్నారు.


 అందుకే అటువైపు నుంచి ఆహ్వానం అందకపోయినా, పదేపదే అన్ని మార్గాల ద్వారా వైసీపీలోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నిస్తూనే వస్తున్నారు. మరీ ముఖ్యంగా చెప్పుకుంటే వైసిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మొన్నటి వరకూ గంటా చేరికకు అడ్డు చెబుతూ వచ్చారు. గంంటాను వైసీపీ లో చేర్చుకోవడం ద్వారా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బల పడవచ్చు అనే అభిప్రాయంతో జగన్ ఉన్నా , విజయసాయి రెడ్డి మాత్రం ఆయనను చేర్చుకునేందుకు ఇష్టపడకపోవడం తో జగన్ సైతం ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ, విజయసాయిరెడ్డి సైతం గంటా చేరికకు ఓకే చెప్పడంతో, ఆయన చేరిక లాంఛనప్రాయమే అని అంతా భావిస్తున్నారు.


 కానీ ఆయనను వైసీపీలో చేసుకునే విషయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇష్టపడకపోవడం వంటి వ్యవహారాల కారణంగా, గంటకు మళ్ళీ తల నొప్పులు మొదలయ్యాయి. జగన్ మాత్రం గంటను చేర్చుకుని కేబినెట్ స్థాయి పదవిని కట్టబెట్టాలనే అభిప్రాయంతో ఉన్నారు.  విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని ఆయనకు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న ద్రోణంరాజు శ్రీనివాస్ ఆకస్మిక మరణంతో ఆ పదవి ఖాళీ అయింది. ఆ స్థానంలో గంటాను కూర్చోబెట్టడం ద్వారా, అన్ని రకాలుగా తమకు కలిసి వస్తుందని లెక్కలు వేసుకునేే పనిలో జగన్ ఉన్నారు. కానీ గంటా శ్రీనివాసరావు వైసీపీ లో చేరితే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని, విశాఖ వైసీపీ ఎమ్మెల్యే  గుడివాడ అమర్నాథ్ అంచనా వేస్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ  గంటా ను వైసీపీలోకి రాకుండా చేయాలని 
అవంతి  శ్రీనివాస్, గుడివాడ అమర్నాథ్ ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: