కరోనా రోజురోజుకు శర వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలందరిలో భయాందోళన నెలకొంటుంది. ఎంతోమందిపై  పంజా విసురుతుంది ఈ మహమ్మారి వైరస్. సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరి పై కన్నేసిన ఈ మహమ్మారి వైరస్ ఎంతోమంది పంజా విసురుతూ ఆస్పత్రి పాలు చేస్తుంది. అంతే కాకుండా ఎంతో మందిని మృత్యువు ఒడిలోకి కూడా చేరుస్తుంది మహమ్మారి ప్రాణాంతకమైన కరోనా  వైరస్. ఈ క్రమంలోనే సామాన్యులు సెలబ్రెటీలు అధికారులు ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా అందరిపై పంజా విసురుతు ఉండడంతో ప్రస్తుతం అందరూ కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రి పాలవుతున్న విషయం తెలిసిందే. అయితే కేవలం అధికారులతో ఆగకుండా ఏకంగా దేశ అధ్యక్షులను సైతం హడలెత్తించింది  ఈ మహమ్మారి కరోనా వైరస్.



 ఇప్పటికే వరుసగా పలు దేశాల అధ్యక్షులు కరోనా వైరస్ బారిన పడడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ధైర్యం చెబుతూ ఉండే ప్రజా ప్రతినిధులు కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రి పాలు కావడంతో ఇక ఆయా దేశాల ప్రజలు మరింత ఆందోళనలో మునిగిపోతున్నారు. ఇలా రోజురోజుకు శర వేగంగా వ్యాప్తి చెందుతున్న మహమ్మారి కరోనా వైరస్ ఎంతో మంది పై పంజా విసురుతుంది. కాగా ఈ మహమ్మారి కరోనా వైరస్ కన్ను మరో  దేశ అధ్యక్షుడుపై  పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు దేశాల అధ్యక్షులు పై పంజా విసిరి ఆసుపత్రి పాలు చేసిన కరోనా  ఇక ఇప్పుడు మరో అధ్యక్షున్ని  కూడా ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమైంది.



 యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా మరికొన్ని దేశాల అధ్యక్షులు కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా బల్గేరియా ప్రధానమంత్రి కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బల్గేరియా ప్రధాని బోయికో బోరిసోవ్  ఇటీవలే కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారిత పరీక్షలు చేసుకోగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో ప్రస్తుతం తాను సెల్ఫ్ ఐసోలేషన్  లో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు బల్గేరియా ప్రధాని. అంతేకాకుండా గత కొంత కాలం నుంచి తనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ కరోనా టెస్ట్   చేసుకోవాలి అంటూ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: