రాష్ట్రంలో  రాజకీయ కాక రేగుతోంది. అది అలా ఇలా కాదు, హద్దులు దాటుతోంది. చుక్కలు చూపిస్తోంది. లెక్కలు తేలుస్తోంది. ఇవన్నీ కూడా ఒకే ఒక చోట కేంద్ర బిందువుగా సాగుతున్నాయి. అవును విశాఖ నుంచే జరుగుతున్నాయి. ఇంతకు పూర్వం విశాఖలో ఇంతటి పొలిటికల్ హీట్ లేదు. విశాఖ కూల్ గా ఉండేది. ఎపుడైతే జగన్ పాలనా రాజధాని అని ప్రతిపాదించారో నాటి నుంచే విశాఖ టాక్ ఆఫ్ ది  స్టేట్,  ఒక్కోసారి నేషన్ కూడా అయిపోతూ వస్తోంది.

చాలా జాగ్రత్తగా గమనిస్తే గత ఏడెనిమిది నెలలుగా విశాఖ టాపిక్ లేకుండా ఏపీ పాలిటిక్స్ సాగడంలేదు. విశాఖలో రసాయన పరిశ్రమలలో విష వాయువులు చెలరెగి కొందదు చనిపోయిన ఘటన జాతీయ స్థాయిలోనే సంచలనం అయింది. అయితే ఇందులోనూ రాజకీయాన్నే కొన్ని పార్టీలు చూశాయి. మరో వైపు విశాఖలో పెద్ద ఎత్తున అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఉన్నాయన్నది ఇంకో సంచలనం.

ఇక విశాఖలో ఒక మత్తు డాక్టర్ వ్యవహారం కూడా అప్పట్లో సంచనలమే. అంతే కాదు, విశాఖలో అక్రమ కట్టడాల కూల్చివేత ఇపుడు సరికొత్త సంచలనం. విశాఖలో మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహారీ గోడలను కూల్చేసిన అధికారులు నాడు పెద్ద గొడవకే తెర తీశారు. అది టీడీపీ అధినాయకత్వం ఖండించేదాకా సాగింది. పరస్పరం నాయకులు దూషణ పర్వాలతో ఈ కధ అంతా వేడి వేడిగా ముందుకు సాగింది.

ఇపుడు ప్రఖ్యాతి గడించిన గీతం విద్యా సంస్థల విషయంలో కూడా కూల్చుడు వ్యవహారం రాష్ట్రంలో కాకను పుట్టిస్తోంది. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఇది సాగుతోంది. దీని బట్టి చూస్తూంటే విశాఖకు పాలనారాజధాని షిఫ్ట్ కాకపోయిన రాజకీయాలు మాత్రం ఎపుడో షిఫ్ట్ అయ్యాయని అంటున్నారు. ఓ వైపు టీడీపీని పొలిటికల్ గా వీక్ చేస్తూనే రచ్చ రాజేయడం ద్వారా వైసీపీ తొడకొడుతోంది. దీంతో అందరికీ విశాఖ మదిలో మెదులుతోంది. ఆ విధంగా చేయడం ద్వారా కచ్చితంగా ఏపీ పొలిటికల్ కాపిటల్ విశాఖ అని టీడీపీయే ఒప్పుకోవాల్సిన సీన్ కల్పించిన ఘనత వైసీపీదే.



మరింత సమాచారం తెలుసుకోండి: