తెలుగుదేశం పార్టీ తన రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కష్టాలు పడుతుంది అన్న సంగతి స్పష్టంగా అర్ధం అవుతుంది. రాజకీయంగా చంద్రబాబు నాయుడు ఎంత బలంగా పార్టీని బలోపేతం చేద్దాం  అని ప్రయత్నాలు చేసినా సరే అందుకు అనుగుణంగా పరిస్థితి కనపడటం లేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఎలా విజయం సాధించాలి అనేది తెలుగుదేశం పార్టీకి ప్రధాన సమస్యగా మారింది. ప్రధానంగా నేతలు ఎవరూ కూడా పార్టీ కోసం పని చేయడానికి ముందుకు రావడం లేదు.

 స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాలి అని భావించిన సరే అందుకు తగిన వాతావరణం లేకపోవడంతో చాలా మంది నేతలు వెనక్కి తగ్గుతున్నారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో చంద్రబాబు నాయుడు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఒక కమిటీని ఏర్పాటు చేసే విధంగా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు. గల్లా జయదేవ్ నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

 దీనికి సంబంధించి త్వరలోనే ఒక కార్యాచరణ కూడా ముందుకు తీసుకుని వెళ్లే ఆలోచనలో ఉన్నారు. కమిటీ ఏర్పాటు చేసి నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి అదే విధంగా ఎలా వ్యవహరించాలి అనే దానిపై ఈ కమిటీ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన పార్టీ సీనియర్ నేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే పార్టీ లో దీనికి సంబంధించి మరి కొంత మంది నేతలతో కూడా చర్చించిన తర్వాత చంద్రబాబునాయుడు ఈ కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. ఇదే కమిటీ రాబోయే తిరుపతి ఉప ఎన్నిక విషయాన్ని కూడా చర్చించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: