రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేసిన సహాయం ఏంటి అనే దానిపై ఇప్పుడు చాలా చర్చలు జరుగుతున్నాయి. ఒక పక్కన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వరద నీరు వచ్చి నానా ఇబ్బందులు పడుతున్న సరే కేంద్ర ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోంది అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం బృందం... పంపించిన కేంద్ర ప్రభుత్వం... ఆంధ్రప్రదేశ్ కి మాత్రం ఇప్పటి వరకు ఏ బృందాన్ని కూడా పంపించిన పరిస్థితి లేదు. దీనిపై ఇప్పుడు ఏపీలో బీజేపీ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ మీద దృష్టి సారించి కేంద్ర బృందాన్ని వెంటనే పంపించింది. మరి హైదరాబాద్ తో పాటుగా ఆంధ్రప్రదేశ్ కూడా తీవ్రంగా వరదలతో నష్టపోయిన పరిస్థితి చూసాం. వ్యవసాయ రంగం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరి ఈ తరుణంలో కేవలం బృందాలను హైదరాబాద్ కే  పంపిస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అని పలువురు నిలదీస్తున్నారు. దీనిపై విపక్షాలు కూడా ఇప్పుడు కాస్త ఆగ్రహంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏపీ సిఎం వైఎస్ జగన్  కేంద్ర ప్రభుత్వం బహిరంగంగానే సీరియస్ అయ్యే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన సమయంలో సీఎం జగన్ కూడా సహకరిస్తూ వస్తున్నారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆయనకు అవసరమైన సమయంలో స్పందించిన పరిస్థితి లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై త్వరలోనే ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం జగన్ తనకు సహాయం చేయాలని వాస్తవ పరిస్థితి ఎలా ఉంది అనే విషయం చెప్పే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఏపీ నుంచి అధికారుల బృందాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఒక నివేదిక కూడా ఇప్పించే ఆలోచనలో జగన్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: