బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం కోసం తీవ్రంగా కష్టపడుతుంది. ఇక ఇదే సమయంలో బీహార్ యువనేత ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన ఇప్పుడు సీఎం నితీష్ కుమార్ ని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా ఈ సారి ఏర్పడే ప్రభుత్వం నితీష్ లేకుండానే ఏర్పడుతుంది అని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు నితీష్ కుమార్ కూడా ఆయన తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం గా ఉన్నారు.

ఎన్డియే  నుంచి బయటకు వచ్చే స్వతంత్రంగా పోటీ చేస్తూ బిజెపి కి పోటీ నిలబెట్టకుండా జెడియు కి పోటీ నిలబెట్టడంపై నితీష్ కుమార్ తీవ్రస్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. ఇదంతా కూడా బిజెపి ఆడిస్తున్న నాటకమని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనితో ఇప్పుడు అసలు బయటకు రావాలా ఉండాలా అనేది నితీష్ కుమార్ కి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం బీహార్ లో ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే నితీష్ కుమార్ కి సానుకూల పవనాలు లేవు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ఎల్జేపీ తో కలిసి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. అటు ఆర్జెడి కూడా లాలూ యాదవ్ బెయిల్ కోసం బిజెపి దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని పలువురు అనుమానిస్తున్నారు. మరి ఈ తరుణంలో చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 15 ఏళ్ల నుంచి బీహార్ సీఎంగా ఉన్న నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా రాజకీయంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆయన ఏ విధంగా ఈ ఎన్నికల్లో గెలిచి సిఎం అవుతారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: