గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాజకీయంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చాలావరకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి సీఎం జగన్ కి మినహా ఏ పార్టీకి కూడా అక్కడ అనుకూలమైన వాతావరణం కనబడటం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు తన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలో అర్ధం కాని పరిస్థితిలో ఉన్నారు.

ఇక ఇదే సమయంలో జనసేన పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ తీరుపై చాలా సీరియస్గా ఉన్నారు. ఒక పక్కన పార్టీ ఎన్ని ఇబ్బందులు పడుతున్న సరే పవన్ కళ్యాణ్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే జనసేన నుంచి కూడా బయటకు వెళ్లే అవకాశం ఉందని వ్యాఖ్యలు ఎక్కువగా రాజకీయ వర్గాల్లో వినిపించాయి. అయితే ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు నేతలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీలో ఉన్న అగ్రనాయకత్వం మొత్తాన్ని కూడా భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసిందని అంటున్నారు.

అంతేకాకుండా వైసీపీ కూడా కీలక నేతలను తమ వైపు తిప్పుకునే విధంగా ప్లాన్ చేస్తోందని వ్యాఖ్యలు వినబడుతున్నాయి. అయితే బీజేపీని జనసేన టార్గెట్ చేయడం వెనుక ప్రధాన కారణం ఏంటి అనేది తెలియదుగానీ జనసేన నేతలను తమ వైపుకు తీసుకోవడం ద్వారా బలమైన వర్గాల నేతలను మంచి పదవులు ఇచ్చి ముందుకు నడిపించాలని తద్వారా సొంతంగా బలపడాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో బిజెపి కోసం పనిచేయడానికి వంద మంది కార్యకర్తలు కూడా ఉండదు. అలాంటిది ఎంత మంది జనసేన నేతలు తీసుకున్న ఉపయోగం ఉండదు. మరి బీజేపీ దీని వెనుక వ్యూహం ఏ విధంగా ఉంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: