తెలుగుదేశం పార్టీని కానీ, ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ను తనదైన శైలిలో వ్యంగ్యంగా, ఘాటుగా తిట్టిపోయడంలో ఎప్పుడూ ముందుంటారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. వైసీపీ ప్రభుత్వంపై వారు ఎప్పుడు విమర్శలు చేసినా, విజయసాయిరెడ్డి గట్టిగానే కౌంటర్ ఇస్తూ ఉంటారు. రోజు వారిపై సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇదే విధంగా మరోసారి విజయసాయిరెడ్డి గట్టిగానే తగులుకుని ఘాటుగా విమర్శలు సంధించారు. " 28 ఏళ్ల క్రితం ఒక గేదె చంద్రబాబుకు వందల కోట్ల రూపాయలు ఇచ్చింది. 2014లో ఆ గేదెలకు గడ్డి పెట్టేందుకు కొన్న బినామీ భూముల్లో వేల కోట్లుగా నోట్లకట్టలు పండకపోతే మరి చంద్రబాబు కోపం రాదా ? " అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.



 ఇక మరో అంశం పై స్పందిస్తూ, " అక్రమ కట్టడాలను చట్టప్రకారం కూలిస్తే పచ్చ బ్యాచ్ మొత్తం నెత్తి, నోరు కొట్టుకుంటోంది. ఆంధ్ర యూనివర్సిటీని దెయ్యాల కొంప అని సదరు ప్రముఖుడు వెటకారం చేసినప్పుడు పేదలు చదువుకునే భ్రష్టు పట్టించిప్పుడు ఒక్కరూ మాట్లాడలేదు. పేదల ప్రయోజనాల కన్నా, పచ్చ నాయకుడిని ప్రయోజనాలే ఎక్కువై పోయాయా'' అంటూ విజయసాయి రెడ్డి తనదైన శైలిలో విమర్శించారు. విశాఖపట్నం ఋషికొండ ఎండాడ గ్రామాల పరిధిలో ఉన్న గీతం వర్సిటీ  అక్రమ కట్టడాలపై కూల్చివేతకు వైసీపీ ప్రభుత్వం దిగడంతో తెలుగుదేశం పార్టీపార్టీ అనుకూల మీడియా పదే పదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఈ విధంగా స్పందించారు.



ఇక మరో విషయంపై స్పందిస్తూ... '' పాలనాధికారం ఉంటే ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కుతుందని, రాజకీయ పార్టీలు భావిస్తాయి. పచ్చ పార్టీ ఫిలాసఫీ మాత్రం దీనికి భిన్నం. దోపిడీలు, ఆక్రమణలు, తవ్వకాలకు పవర్ తప్పనిసరి అని అనుకుంటుంది. అందుకే అన్ని రకాల మాఫియాలను ప్రోత్సహించింది.పుట్ట పగులుతుంటే తట్టుకోలేకపోతుంది. అంటూ సోషల్ మీడియా ద్వారా విజయసాయిరెడ్డి గట్టిగానే కౌంటర్ లు ఇచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: