ఆ గిరిజన పల్లెలో కరోనా ఎందుకు రాలేదో తెలిస్తే షాక్.. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో మారుమూల ఆది వాసీ పల్లె అది. అక్కడి పొలాల్లో అడుగు పెడితే, భూమిలోంచి పైకి లేచిన వాన పాములు పాదాలకు గిలిగింతలు పెడుతుంటాయి. తేనెటీగలు, సీతాకోక చిలుకలు, మిత్రకీటకాలు మన చుట్టూ తిరుగుతుంటాయి. గోరింకలు, పాలపిట్టలు, పిచ్చుకల రెక్కలు రెపరెప కొట్టుకుంటూ గాలిలోకి లేస్తుంటాయి. రసాయన ఎరువులు లేని ఈ మట్టి పరిమళం ఈ జీవాలకు నీడైంది. ఇక్కడి ప్రజలు ఐక్యతా, ఆలోచనా తీరే ఆ నేలను స్వచ్ఛంగా మార్చింది.

భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి గ్రామసంఘాలుగా ఏర్పడి, ప్రకృతి సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. తమ పంటలకు స్వయంగా సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. పురుగు మందులను తమ దరిదాపుల్లోకైనా రానివ్వకుండా,  సేంద్రియ గ్రామంగా గుర్తింపు తెచ్చారు.

ఇంతకీ అది ఓ ఊరో చెప్పలేదు కదా.. కొండల మధ్య కొలువైన ఆ కుగ్రామం.. విజయనగం జిల్లా, కురుపాం మండలంలో పెదకొండ,తోటకొండ,తివ్వకొండల మధ్య ఉన్న కొండబారిడి. అక్కడ వ్యవసాయం తప్ప మరో జీవనాధారం లేదు. ఈ నేపథ్యంలో వారి మధ్యకు ‘జట్టు ట్రస్ట్‌’ వచ్చింది. ఆ కొండ ప్రజలకు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని పరిచయం చేసింది. వారంతా సంఘాలుగా ఏర్పడి ‘జట్టు ట్రస్టు’ తో జతకట్టి, శిక్షణ తీసుకున్నారు.  

ఇలా సాగు చేసి, గతంలో కంటే, 40 శాతం ఎక్కువ దిగుబడి సాధించారు. వారు తినే సహజమైన ఆహారమే, వారిలో ఇమ్యూనిటీ పెంచింది. అందుకే ఇప్పటి వరకు కొండ బారిది లో ఒక్క కరోనా కేసు కూడా లేదు.. మరో విశేషం ఏంటంటే.. ఈ గ్రామం నక్సల్బరీ ఉద్యమానికి పుట్టినిల్లుగా చెబుతారు. ఒకప్పుడు సమాజంలో విప్లవం తీసుకొచ్చిన ఆ గ్రామమే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అనే విప్లవానికీ ఆలవాలమవుతోంది. ఆ స్వచ్ఛ గ్రామాన్ని మీరూ చూస్తారా..  ఈ వీడియోలో వీక్షించండి…


మరింత సమాచారం తెలుసుకోండి: