చైనా నుంచి వచ్చి ఇక్కడ ప్రజలను గత ఆరు నెలలు పాటు నిద్ర పట్టనివ్వకుండా చేసిన మహమ్మారి వ్యాధి కరోనా.. ఈ కరోనా వల్ల దేశం మొత్తం అతలాకుతలం అయింది. ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు తగ్గిపోయాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రజలు వణికిపోయారు. అంతేకాదు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరింది. ఈ మేరకు లాక్ డౌన్ కూడా విధించింది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యాయి. రోజువారీ కూలీల పరిస్థితి పూర్తిగా చిన్నా భిన్నం అయ్యింది. మొదట్లో ప్రభావం ఎక్కువగా ఉన్నా , ఇప్పుడు పూర్తిగా తగ్గిందని తెలుస్తుంది.



దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం పూర్తిగా తగ్గింది.. గత కొన్ని నెలలుగా కరోనా వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలిసిందే.. వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ వల్ల చాలా మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇప్పటికీ చాలా మంది కరోనా తో పోరాడుతున్నారు. కొంత మంది హోమ్ ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు నిదర్శనం ఇటీవల తగ్గిన కరోనా కేసులు, అలాగే మరణాలు, రికవరీ రేటు ను చూస్తే అర్థమవుతుంది.. అత్యంత తీవ్రత ఉన్న మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయాయి.



ఇది ఇలా ఉండగా గత శని , ఆదివారాల్లో 11 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం అందులో కేవలం 50 వేల మందికి మాత్రమే పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.ఇక దేశ వ్యాప్తంగా ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 78 లక్షలు ఉన్నా, మృతుల సంఖ్య ఒక లక్షా పదమూడు వేల మందికి కరోనా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.62,078 మంది కరోనా ను జయించి డిచార్జ్ అయ్యారు. 8.5% దేశంలో యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అయితే కరోనా ప్రభుత్వం మన దేశం మొత్తం మీద తగ్గింది. కానీ అమెరికా, ఫ్రాన్స్ ఇతర రాష్ట్రాలను కదిలించకుండా ఉంటే ఇంకా మన దేశం పూర్తిగా కరోనా ను జయించినట్లే..

మరింత సమాచారం తెలుసుకోండి: