కరోనా వైరస్ ప్రభావం దేవుడిపై కూడా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది తమ బాధలను దేవుడికి చెప్పుకోవడానికి వెళ్లాలి అన్న ఆలయాలు తెరుచుకోని  పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం కరోనా  వైరస్ వ్యాప్తి కారణంగా వరుసగా మూతపడుతుంది. గతంలో భక్తులకు దర్శనాలు కల్పిస్తూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ తర్వాత అర్చకులు వరుసగా కరోనా  వైరస్ బారిన పడడంతో మరోసారి పునరాలోచించి ఆలయాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆలయానికి భక్తుల దర్శన అనుమతి నిషేధించింది టిటిడి బోర్డు.



 ఇక అటు భక్తులందరూ ఎప్పుడెప్పుడు ఆలయం తెరిచుకుంటుంది అని..  శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుందోనని  వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఇలాంటి క్రమంలోనే తిరుమల  శ్రీవారి భక్తులకు టీటీడీ  తీపికబురు చెప్పింది. శ్రీవారి దర్శనార్థం వచ్చిన సర్వదర్శనం టైస్ప్లాంట్  టోకెన్లను నేటి నుంచి తిరుమలలో ప్రారంభించేందుకు నిర్ణయించింది, ఇక ఈ టిక్కెట్లను భూదేవి కాంప్లెక్స్ కౌంటర్లు జారీ చేసేందుకు నిర్ణయించింది టిటిడి బోర్డు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి భక్తులు టోకెన్లు పొందేందుకు అవకాశం ఉంటుంది అంటూ తెలిపింది. దాదాపు ప్రతిరోజు మూడు వేల చొప్పున టోకెన్లను అందించనున్నట్లు తెలిపింది.




 ఇక కౌంటర్ల కు ముందు వచ్చిన వారికి ముందుగా టోకెన్ల కోట పూర్తయ్యేవరకు టోకెన్లు ఇస్తారు   శ్రీవారి దర్శనానికి సంబంధించి ఒక రోజు ముందుగానే టోకెన్లు బుక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. అంటే ముందు రోజు టోకెన్లు తీసుకుని ఆ తర్వాత రోజు శ్రీవారి దర్శనానికి భక్తులు వెళ్లాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ ఉచిత దర్శనం టోకెన్లు కేవలం భక్తులకు మాత్రమే అంటూ స్పష్టం చేస్తోంది. అయితే అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేసిన తర్వాతనే భక్తులను తిరుమలకు అనుమతించేందుకు నిర్ణయించింది టిటిడి బోర్డు. ఇక ఈ ఉచిత దర్శనం టోకెన్ విధానాన్ని పరిశీలించి మరి కొన్ని రోజుల తర్వాత దర్శనాల సంఖ్య పెంచాలి అనే విషయం పై కీలక నిర్ణయం తీసుకుంటామంటూ స్పష్టంచేసింది టిటిడి బోర్డు.

మరింత సమాచారం తెలుసుకోండి: