ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి అర్ధమవుతుంది. సీఎం జగన్ కూడా ఇప్పుడు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఆయనకు అనుకున్న విధంగా వాతావరణం కలిసి రాకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో సీఎం జగన్ ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వ సహాయం కోరిన సరే రాష్ట్ర ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు అందలేదు అనే భావన వ్యక్తమవుతోంది. దీని ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.  ఈ విషయంలో సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు సీఎం జగన్ సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశం ఉంది కష్టాలు ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు రావటం లేదు అనే భావన రాష్ట్ర ప్రజల్లో కూడా వ్యక్తమవుతోంది. వరదలు వచ్చి తీవ్రస్థాయిలో వ్యవసాయ రంగం నష్టపోయిన సరే సహాయం చేయడం లేదు.

అయితే ఇప్పుడు సీఎం జగన్ సొంత గానే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు. పరిశ్రమల ద్వారా ఆదాయం భారీగా రాష్ట్ర ప్రభుత్వానికి చేకూరుతుంది. కాబట్టి త్వరలోనే ఒక పారిశ్రామిక పాలసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఈ పారిశ్రామిక పాలసీ ద్వారా పరిశ్రమలకు పూర్తిస్థాయిలో రాయితీలు ఇచ్చే రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేయాలని అయితే రాష్ట్రానికి ఆదాయం పెరిగే విధంగా కొన్ని కీలక నిర్ణయాలు కూడా పరిశ్రమల ద్వారా తీసుకుని ముందుకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే పరిశ్రమల పాలసీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: