తెలంగాణలో  కరోనా కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో కూడా చర్చలు జరుగుతున్నాయి. అసలు తెలంగాణలో కరోనాను రాష్ట్రప్రభుత్వం కట్టడి చేసిందా...? అసలు వాస్తవాలు చెప్పడం లేదా అనే ప్రశ్నలు ఎక్కువగా వినబడుతున్నాయి. రాజకీయంగా కూడా ఇప్పుడు కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. చాలా రోజుల తర్వాత తెలంగాణలో కేవలం 600 కేసులు రావడంతో అందరు కూడా ఆశ్చర్య పోయారు.

ఇక వచ్చేది చలికాలం కావడంతో తెలంగాణలో కరోనా వ్యాధి  తీవ్రంగా ఉండే అవకాశం  ఉంటుందా...? లేదా అనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. రాజకీయంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకోవడానికి కరోనాను విపక్షాలు వాడుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ మొదలైతే అసలు ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఎలా ఉన్న సరే భవిష్యత్తులో జాగ్రత్తగా లేకపోతే మాత్రం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడే అవకాశం ఉందని కరోనా మరణాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని పలువురు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు కరోనా విషయంలో కాస్త జాగ్రత్తగా లేకపోతే మాత్రం అనవసరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి జిల్లాలలో కరోనా కేసులు తీవ్రత చాలా ఎక్కువగా ఉందని కాబట్టి ఇప్పుడు టెస్ట్ లు కూడా పెంచాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇక వైద్య సదుపాయం విషయంలో కూడా తెలంగాణలో ఆందోళన వ్యక్తం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం మెరుగైన సేవలు అందిస్తున్నా సరే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు టెస్ట్ లు కూడా చేయించుకోవడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: