ఆంధ్ర ప్రదేశ్ లో ఘరానా మోసాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి.. అధికారులమని చెప్తూ నమ్మించి, వారిని సర్వం దోచుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని రాయల సీమ జిల్లాల్లో  ఎటువంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కరోనా వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు డబ్బు ఆశ చూపించి పెట్టుబడులు పెంటించి చాలా డుప్లికెట్ కంపెనీలు ప్లేటు ఫిరాయించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన జిల్లాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.



ఇటీవల విశాఖలో ఒక అమానుషం చోటు చేసుకుంది..  మిలటరీ అధికారులమని నమ్మించి ఆన్ లైన్ లో డబ్బులు పంపించెలా చేసి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోవడం జరిగింది. ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే మిలటరీ పేరును వాడారు. మిలటరీ అధికారులమని , మాకు నగరంలో ఎక్కడ వాహనాలు కొన్నా కూడా అతి తక్కువ ధరలకే వస్తాయని ఫోన్ ద్వారా నమ్మించి, అందుకోసం కావలసిన డబ్బులను ఆన్ లైన్ నుంచి పంపించుకొని తర్వాత అడ్రెస్స్ లేకుండా పోతున్నారు. ఈ ఘటన మరువక ముందే ఇప్పుడు ఆంధ్రాలోనే మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.



ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరులో ఈ ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కోళ్ల ఫారాలను పెట్టిస్తాము.. ఇకపోతే కోడి పిల్లలను అందించే దగ్గర నుంచి వాటి పెంపకానికి కావలసిన దానా , మందులను అన్నిటినీ తామే చూసుకుంటామని రైతులను నమ్మించి వారి దగ్గర నుంచి లక్షల కొద్ది డబ్బులను లాక్కొని జెండా ఎత్తేసింది ఓ కంపెనీ.. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా కూడా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఏదో కేసు ఫైల్ అయింది కదా అని కంపెనీకి కాల్ చేశారు. వారు మాత్రం కంపెనీ పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది.కొద్దీ రోజులు ఆగాలి. ఇప్పుడు మేము ఏమి చేయలేము అంటూ చేతులెత్తేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని రైతులు అభిప్రాయపడుతున్నారు..పోలీసులు సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: