మన్ కి బాత్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన ఒక భారతీయ రేడియో కార్యక్రమం, దీనిలో అతను ఆల్ ఇండియా రేడియో, డిడి నేషనల్ మరియు డిడి న్యూస్‌లలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మొదటిగా ఈ కార్యక్రమాన్ని 3 అక్టోబర్ 2014 న మొదటి ప్రదర్శన నుండి, 70 ఎపిసోడ్లు ఉన్నాయి. 70 వ ఎపిసోడ్ 25 అక్టోబర్ 2020 న ప్రసారం చేయబడింది. ఈసారి ప్రత్యేకించి ఖద్దరు బట్టలను ఆకాశానికి ఎత్తేసిన విషయం అందర్నీ ఆశ్చర్యపరిచింది..... అసలు ఖద్దరు వస్త్రాలు గురించి మాట్లాడాల్సిన సందర్భం లేని సమయంలో మోడీ ఇలా ఖాదీ బట్టలు గురించి మాట్లాడటం వెనుక ఆయన ఆసక్తి ఏమిటో తెలియలేదు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతున్న సమయంలో ఖద్దర్ వస్త్రాల ప్రస్తావన తెచ్చి దేశంలో ఖాదీ బట్టలకు డిమాండ్ పెరుగుతున్నట్లు అందరికీ తెలియజేశారు. ఆత్మనిర్భర్ లోకల్ టు వోకల్ ప్రోగ్రాములకు అసలు సిసలైన నిర్వచనంలా మారిందని ప్రత్యేకించి చెప్పారు. మెక్సికోలోని ఒహాకాలో స్ధానిక మెక్సినక్ బ్రౌన్ రకం ఖద్దర్ ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలియజేశారు.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.... అందరూ మాస్కులు తప్పనిసరిగా వాడుతున్నారు.... ఈ నేపధ్యంలో ఖాదీ వస్త్రాలతో చేసిన మాస్కులకు బాగా డిమాండ్ పెరుగుతోందన్నారు. అంతేకాకుండా ఇవే ఇప్పుడు ఎక్కువగా అమ్ముడు పోతున్నాయి అని పేర్కొన్నారు. స్వయం సహాయక బృందాల్లోని మహిళలు ప్రతిరోజు వేలాది ఖద్దర్ మాస్కులను తయారు చేస్తున్నట్లు మోడి తెలిపారు. అంతేకాదు స్వయం ఉపాధి నిర్మించుకున్న మహిళలను ప్రతిభావంతులను మెచ్చుకున్నారు. ఇక అమెరికాలోని చిన్మయ్ పాఠంకర్ మల్లయోధులను తయారు చేస్తున్న విషయాన్ని మోడి ప్రస్తావించారు. భారత్ తరహా మల్లయుద్ధంపై అమెరికాలోని యువత ఆసక్తి చూపటం పట్ల ఆయన ఎంతగానో సంతోష పడుతున్నట్లు తెలిపారు. భారతీయులు విస్మరించిన మల్లయుద్ధమును అమెరికా యువత నేర్చుకోవటం మనకు గర్వకారణం అంటూ పొగిడారు.

ఇలా పది అంశాల గురించి మాట్లాడిన ప్రధానమంత్రి తమిళనాడుకు చెందిన తిరువక్కురళ్ గురించి ప్రస్తావిస్తూ దేశంలోని ప్రతి ఒక్కరూ తిరువక్కురళ్ ను చదవాలని సూచించారు... కానీ ఇక్కడ సామాన్యుడికి అర్థమయ్యేలా అసలు..... తిరువక్కురళ్ అంటే ఏమిటి ? తమిళనాడుకు చెందిన దీనిని దేశంలోని మిగితా ప్రాంతాల వాళ్ళు ఎందుకు చదవాలో మాత్రం మోడి చెప్పకపోవడం గమనార్హం. చివరగా దసరా పర్వదిన గురించి మాట్లాడుతూ.... మొదట పండుగ ప్రాముఖ్యత గురించి మాట్లాడిన మోడీ ఆ తర్వాత పండగ పూట బయటకు వెళ్లలేని పరిస్థితిలో మనము ఉండటం బాధాకరమని అన్నారు. ఇలా మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ పలు అంశాలను మాట్లాడినప్పటికీ... ఖద్దరు వస్త్రాల ప్రస్తావన హైలెట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: