మనదేశంలో న్యూస్ చానెళ్లకు ఎంత స్వాతంత్య్రం ఉందో మీకు తెలిసిందే. అయితే ఎంత స్వాతంత్య్రం కలిగి ఉన్నా చానెళ్లు ఎంతవరకు ఒక వార్తను చూపించాలో అనేది అనుసరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. కొంతమంది రాజకీయనాయకుల స్వార్ధ ప్రయోజనాలకోసం ఈ వార్త చానెళ్లను ప్రతిపక్షాలపై ప్రధాన అస్త్రంగా వాడుతుంటారు. అయితే ఇలాంటివి జరగకుండా భ్రాతదేశంలోని అన్ని వార్తా చానెళ్లను నియంత్రణలో పెట్టడానికి ఒక సంస్థ ఉంది. అదే భారత టీవీ న్యూస్ చానళ్ల స్వతంత్ర సంస్థ 'న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ' (ఎన్‌బీఎస్ఏ). ఇప్పుడు ఈ సంస్థ కొన్ని వార్త సంస్థలకు గడిచిన రెండు రోజుల్లో చాలా నోటీసులు జారీ చేసింది. అయితే ఆ వివరాలను తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ను చదవండి.

ఎన్‌బీఎస్ఏ భారత్ లోని కొన్ని టీవీ న్యూస్ చానళ్లకు తాము చేసిన తప్పులకు బహిరంగంగా క్షమాపణలు కోరాలని  ఆదేశించింది. వీటిలో తాజా కేసు న్యూస్ చానల్ 'టైమ్స్ నౌ'కు సంబంధించినది. అక్టోబర్ 27న రాత్రి 9 గంటలకు క్షమాపణ అడగాలని ఎన్‌బీఎస్ఏ దానికి సూచించింది. అయితే వివరాల్లోకి వెళితే ఎన్‌బీఎస్ఏ చెబుతున్న ప్రకారం 'టైమ్స్ నౌ' 2018 ఏప్రిల్ 6న ప్రసారం చేసిన ఒక కార్యక్రమంలో ప్రముఖ రచయిత మరియు సామజిక కార్యకర్త అయినా సంయుక్త బసు ని తప్పుగా నిరూపించేందుకు సశారు న్యూస్ ఛానెల్ ప్రయత్నిచింది. పైగా ఈ విషయంలో ఈమెకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడం అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపింది. దీనికి ఎన్‌బీఎస్ఏ వీరికి ఇచ్చిన నోటీసులో సంయుక్త అప్పట్లో చేసిన ఫిర్యాదును కూడా ప్రస్తావించింది. ఇందులో ముఖ్యంగా ఆమెపై ఒక హిందూ వ్యతిరేకిగా, దేశ వ్యతిరేకిగా, రాహుల్ గాంధీని ట్రోల్ చేసే టీంకి లీడర్ గా చెప్పినట్లు తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఏకపక్షంగా ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

ఎన్‌బీఎస్ఏ చెబుతున్న ప్రకారం అప్పుడు టైమ్స్ నౌ ఛానల్ చేసింది తప్పు అని, ఈ కేసులో మేము నిస్పక్షపాతంగా వ్యవహరించలేదని "అక్టోబర్ 27న రాత్రి 9 గంటలకు టీవీ స్క్రోలింగ్ లో చూపిస్తూ సంయుక్త బసును క్షమాపణ అడగాలి" అని సంస్థ సూచించింది. గతంలో ప్రసారం చేసారు కాబట్టి ...దీనికి సంబంధించి ఎటువంటి వీడియోలు ఉన్నా వాటన్నింటినీ తొలగించాలని టీవీ చానెల్స్ కు సూచించింది. అంతేకాకుండా అంతకు ముందు, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో సంచలనాత్మకంగా, తప్పుల తడకలతో, సున్నితత్వం లేకుండా రిపోర్టింగ్ చేసినందుకు ఎన్‌బీఎస్ఏ శుక్రవారం తన సభ్య చానళ్లు ఆజ్ తక్, జీ న్యూస్, న్యూస్ 24, ఏబీపీ న్యూస్, ఇండియా టీవీలకు నోటీసులు పంపింది. ఈ విధంగా వాస్తవంగా ఏమిజరిగిందో తెలుసుకోకుండా వీరు ప్రసారం చేసే వార్తల వలన ఎంతోమందికి నష్టం కలిగే అవకాశం ఉంది. ఇకముందైనా ఇలాంటివి జరగకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని కోరుకుందాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: