ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను విధించాయి. వాటి తో పాటుగా ఎక్కడిక్కడ సేవలను పూర్తిగా బంద్ చేశారు. కరోనా తీవ్రత ఈ మధ్య తగ్గుముఖం పట్టింది.. ముఖ్యంగా చెప్పాలంటే మొదట్లో ఆంధ్రలో కరోనా ప్రభావం రెట్టింపు అవుతూ వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు సినీ రంగం, వాణిజ్య వ్యాపారాలు పూర్తిగా మూత పడ్డాయి. అక్కడ పని చేసే కార్మికులను ఆదు కోవడానికి ప్రభుత్వం, సినీ రాజకీయ ప్రముఖులు ముందుకు వచ్చారు. అలా పేదలను కొంత వరకు ఆదుకున్నారు.



అన్ లాక్ డౌన్ అమలు చేయడంతో.. కరోనా నిబంధనలను పాటిస్తూ వ్యాపారాలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మళ్లీ రాష్ట్రం లోని అన్ని సంస్థలు స్వచ్ఛందంగా తెరుచుకున్నాయి. ఇక ఎప్పుడు నిత్య కల్యాణాల తో రద్దీగా ఉన్న ప్రముఖ దేవాలయాలను కూడా తాత్కాలికంగా మూసి వేశారు. స్వామి వారికి పూజా కార్యక్రమాలను నిర్వహించడానికి  కేవలం నిర్ణయించిన ప్రధాన అర్చకులు మాత్రమే స్వామి వారికి పూజలను నిర్వహించారు. తర్వాత కొద్ది రోజులు కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా పెరగడంతో దేవాలయాలను పూర్తిగా మూసివేశారు.



ఇటీవల దేవాలయాలు పాక్షికంగా తెరుచుకున్నాయి. కొంతవరకు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే భక్తులను కూడా   కూడా కొంతవరకు దర్శనానికి అనుమతిని ఇస్తున్నారు. ఉచిత దర్శనాన్ని ప్రభుత్వం అమలు చేసిన కూడా కొందరు అధికారులు డబ్బులు తీసుకున్నారు. ఈ మేరకు కొన్ని వాదోపా వాదనలు జరిగిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రోజుకు 3 వేల మందికి సర్వ దర్శనానికి అనుమతి నిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరింత మందికి సర్వదర్శానికి అనుమతిస్తారా లేదా అనేది చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: