తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కీలకమైన నేతలు ఎవరూ కూడా ఆశించిన స్థాయిలో పని చేయడం లేదు అని ఆరోపణలు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. కీలక నేతలుగా ఉన్న వారు సమయం వేస్ట్ చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా తెలంగాణలో బలోపేతం అవ్వాల్సిన సమయంలో ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు భావ్యమని బిజెపి కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే ఇప్పుడు నేతల్లో ఉత్సాహం నింపడానికి బీజేపీ అధిష్టానం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బిజెపికి బలపడాలంటే కొన్ని కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేయాల్సిన అవసరం అనేది ఉంది. అందుకే ఇప్పుడు తెలంగాణ నుంచి కొంతమందిని కీలక పదవులకు ఎంపిక చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. కొంతమంది నియోజకవర్గస్థాయి ఇన్చార్జిలు అసలు పనిచేయడం లేదని దీని కారణంగా నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ మాత్రమే బలంగా ఉంటుందని పలువురు కాబట్టి ఈ లోపాన్ని అధిగమించడానికి భారతీయ జనతా పార్టీ అధిష్టానం కాస్త సీరియస్గా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తోంది.

ఇక తెలంగాణ నుంచి కూడా ఇద్దరు కేంద్ర మంత్రులను తీసుకోవాలని కూడా భావిస్తోంది. ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. మరో కేంద్ర మంత్రిని కూడా తెలంగాణ నుంచి ఎంపిక చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అంతేకాకుండా ఇతర పార్టీలకు సంబంధించిన నేతలను కూడా ఇప్పుడు తీసుకుంటే బాగుంటుంది అనే భావన వ్యక్తమవుతోంది. ప్రోత్సహిస్తే మినహా నేతల్లో ఉత్సాహం వచ్చే అవకాశం లేదని కాబట్టి ఆ విధంగా అడుగులు వేయాలని కొంతమంది నేతలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: