కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీరుపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా దేశ వ్యాప్తంగా పెరుగుతున్న సరే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికల కోసం కరోనా వైరస్ వ్యాక్సిన్ ని వాడుకుంటుంది అని తీవ్రస్థాయిలో పలువురు మండిపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కరోనా వ్యాక్సిన్ వస్తే బీహార్ ప్రజలు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ఆయన ప్రకటించారు.

ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో  కరోనా వ్యాక్సిన్ వేస్తే ఎన్నికలు లేని రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయరా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా కూడా మోడీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు వ్యాక్సిన్ విషయంలో రాజకీయం ఏ విధంగా చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేర్పిన రాజకీయమా అంటూ పలువురు మండిపడుతున్నారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.

అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తించడం అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు భావ్యమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కాస్త తగ్గినా సరే త్వరలోనే చలికాలం ఉన్న నేపధ్యంలో  తీవ్రస్థాయిలో విజృంభించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కరోనా కట్టడికి దృష్టిపెట్టాలని ఇప్పట్లో రని వ్యాక్సిన్ కోసం హామీ ఇవ్వటం ఎందుకు అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైనికులను ప్రాంతాల వారీగా విభజించి ప్రధాని మోడీ మాట్లాడటంపై మండిపడుతున్నారు. ఈ విధానాలు ఎంత మాత్రం భావ్యం కాదని ఈ విషయంలో మోడీ కాస్త జాగ్రత్తగా వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది అనే భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. మరి మోడీ ఎలా మాట్లాడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: