తెలంగాణ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కచ్చితంగా పూర్తి చేస్తామని తెలంగాణ సర్కార్ స్పష్టంగా చెబుతున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఎవరెన్ని విమర్శలు చేసినా సరే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలు ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి.

ఈ నేపధ్యంలో జియ గూడా లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు.  పెద్దలు ఇల్లు కట్టి చూడు , పెళ్లి చేసి చూడు అంటారని, ఆ రెండు కష్టమే అని అర్థం అని ఆయన వ్యాఖ్యానించారు. పేదల కల సాకారం చేసిన  ఏకైక ముఖ్యమంత్రి  కేసీఆర్ అని కొనియాడారు. పేద ఇంటి ఆడ బిడ్డ పెళ్లికి లక్షా 116 రూపాయలు ఇస్తున్నామని, ఇప్పుడు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తున్నారని ఆయన చెప్పారు. 560 స్క్వేర్ ఫీట్ తో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తున్నామని ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా 18 వేల కోట్ల రూపాయల తో 2 లక్షల 75 వేల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సగం రెడీ గా ఉన్నాయని మంత్రి అన్నారు. డబుల్ బెడ్ రూమ్ పంపిణీ విషయంలో టిఆర్ఎస్ నేతలు ఎవరూ జోక్యం చేసుకోరని స్పష్టం చేసారు. డబుల్ బెడ్ రూమ్ ఇస్తామంటూ మోసాలకు పాల్పడే దళారులను ప్రజలు నమ్మవద్దని అన్నారు. ఇళ్ల పంపిణీ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. గ్రేటర్ హైద్రాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ను దశల వారిగా ఇస్తామని ఆయన అన్నారు. జియా గూడ లో కబేలా కడతామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: