దేశవ్యాప్తంగా కరోనా రెండో వేవ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చాలామంది అంచనాలు వేస్తున్నారు. దీనితో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా వరకు కూడా అప్రమత్తం అవుతున్న సంగతి తెలిసిందే. కరోనా రెండో మొదలైతే మాత్రం పరిస్థితి తీవ్రత చాలా దారుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్న సంగతి తెలిసిందే.

అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పటం చాలా కష్టం గానే ఉంది. అటు ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలు కూడా దాదాపుగా రెండు ప్రళయానికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా యూరప్ దేశాల్లో కరోనా తీవ్రత చాలా దారుణంగా ఉంది. అమెరికాలో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దాదాపుగా ప్రతిరోజు 80 వేల కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉంది. త్వరలోనే దేశంలో ఎన్నికల నేపథ్యంలో అసలు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేదానిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 మిగిలిన దేశాల్లో కూడా రెండో వేవ్ మొదలయ్యే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. దీనితో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా విషయంలో ఒక ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. దాదాపుగా దేశాలన్నీ కూడా ఇప్పుడు లాక్ డౌన్ లో కి వెళ్లి పోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా అమెరికా కూడా మరో సారి లాక్‌డౌన్‌ లోకి వెళ్ళే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మన దేశంలో కూడా లాక్ డౌన్ విధించే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: