తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడం అనేది ఇప్పుడు బీజేపీకి చాలా కష్టం. ఆ పార్టీని ఎదుర్కోవడంలో బీజేపీ నేతలు కూడా చాలావరకు విఫలమవుతున్నారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరిస్థితుల ఆధారంగా చూస్తే తెలంగాణలో భారతీయ జనతాపార్టీ బలపడటం అనేది చాలా కష్టం అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే తెలంగాణలో ఉన్న బిజెపి నేతలు అందరూ కూడా టిఆర్ఎస్ లోకి వెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ప్రధానంగా పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జిలు కొంతమంది ఇప్పుడు బిజెపి నుంచి బయటకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని వ్యాఖ్యలు వినబడుతున్నాయి. మళ్లీ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు దానికి ప్రధాన కారణం ఏంటి అంటే... విపక్షాలు బలంగా లేకపోవడం అనేది స్పష్టంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఏ మాత్రం బలంగా లేదు. ఇక బీజేపీ కూడా బలపడాలని భావించిన సరే చాలా జిల్లాల్లో పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు.

అందుకే బీజేపీ నేతలు చాలా మంది టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్లి పోయే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. ఇక ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారు కూడా ఇప్పుడు పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు పది మంది నేతలు ఇప్పుడు బీజేపీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా దాదాపుగా పది నుంచి పదిహేను మంది నేతలు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చాలామంది నేతలు పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని పలువురు అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో ఒక మాజీ ఎంపీ కూడా ఉన్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: