పాలకులు తీసుకునే కొన్ని నిర్ణయాలు మొత్తం పాలన మీద ప్రతిబింబిస్తాయి. ఒక్కోసారి అవి చాలా సీరియస్ మ్యాటర్ గా మారిపోయి పూర్తి వ్యతిరేకతను తీసుకొస్తాయి. ఇప్పటిదాకా అంటే దాదాపు పదిహేడు నెలలుగా ఏపీలో జగన్ సాగిస్తున్న పాలన మీద జనాలకు ఒక మంచి భావనే ఉంది. టీడీపీ కానీ ఇతర పక్షాలు కానీ ఆరోపిస్తున్నంతగా వ్యతిరేకత అయితే ఇప్పటికైతే  లేదు. సరిగ్గా ఈ సమయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం మాత్రం మొత్తం సీన్ ని మారుస్తుంది అంటున్నారు.

అదే రవాణా చట్టంలో కీలక మార్పులు తెస్తూ భారీ ఎత్తున జరీమానాలు, అపరాధ రుసుములను జగన్ ప్రభుత్వం విధించడం మాత్రం కచ్చితంగా జనాల్లో వ్యతిరేకతను పెంచుతోంది. ఈ దేశంలో రైట్ రూట్ లో వెళ్ళే వారు ఎవరుంటారు. చాలా తక్కువ మందిని మాత్రమే రెడ్ సిగ్నల్ భయపెడుతుంది. అదే సమయంలో అడ్డం తిరిగే వారే ఎక్కువగా ఉంటారు. వారే ఇపుడు ఏపీలో వీర బాధితులు అవుతున్నారు.  

ఇక జగన్ ప్రభుత్వం తెచ్చిన కొత్త రూల్స్ ఏంటో చెప్పుకుంటే కూడా ఎవరైనా ఇట్టే బాధితులు అవుతారు అని కూడా చెప్పొచ్చు. అనవసరంగా హారన్ మోగిస్తే భారీ ఫైన్ అంటున్నారు. మరి హారన్ మోగించేది అవసరానికో అనవసరానికో అన్నది ఎవరు కూర్చుని తీర్పు చెబుతాడు. అంటే ట్రాఫిక్ పోలీసులకు, రవాణా అధికారులకు తిక్క రేగితే చాలా సింపుల్ లా ఆ పేరు మీద అపరాధ రుసుం రాసేసి వేల రూపాయలతో  జేబులు చిల్లు చేయవచ్చు అన్నమాట. ఇక రోడ్లు కూడా మనకు చాలా ఇరుకు. మరో వైపు ఒకే సమయంలో జనాలు రోడ్ల మీదకు వస్తారు. అది  చాలా కామన్.

దాంతో ఆఫీసులకు వెళ్లేవారు, ఇతర పనులకు పోయేవారు దగ్గర దారులు వెతుక్కుంటారు. ఇలా ఏ విధంగా చూసినా భారీ ఫైన్ కి బలి అయ్యే జీవులు నూటికి తొంబై శాతం ఉంటారు. దీన్ని ఇపుడు విపక్షాలు ఆయుధంగా మార్చుకుంటున్నాయి. సామాన్యుడు సగటు జీవులు బలి అవుతున్నారన్నది ప్రభుత్వానికి తట్టకపోతే మాత్రం ఇదే అతి పెద్ద అంశంగా మారుతుంది అంటున్నారు. దగ్గరలోనే లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఇలాటి భయంకరమైన అపరాధ రుసుం పెట్టి తలగోక్కోవాలంటే వీర లెవెల్లో వ్యతిరేకత వచ్చిపడుతుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: