దేశంలో ప్రస్తుతం శరవేగంగా కరోనా  వైరస్ కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులతో ప్రజలందరూ భయపడిపోతున్నారు. కానీ క్రమక్రమంగా ప్రజలలో కూడా కరోనా వైరస్ పై పూర్తిగా భయం తగ్గిపోతుంది అన్నది అర్థం అవుతుంది. ప్రజలందరూ కరోనా వైరస్ పేరెత్తితే భయపడటం మాని  కలిసి జీవించాలని నిర్ణయానికి వస్తున్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో కూడా ఇలాంటి ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి, ప్రస్తుతం కరోనా వైరస్ కు సంబంధించి ఎన్నో అధ్యయనాలు జరుగుతూ ప్రతి అధ్యయనంలో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.


 ప్రస్తుతం పలు దేశాలు కరోనా వైరస్ టీకా అభివృద్ధి చేసి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజలు కరోనా వైరస్ టీకా కోసం ఎదురు చూడకుండా వైరస్ తో సహజీవనం చేసేందుకు సిద్ధమైనట్లు తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కరోనా టీకా  వచ్చే ఏడాది తొలి నాళ్లలో వచ్చినప్పటికీ దానిని వేయించుకోవడానికి 61 శాతం మంది ప్రజలు ఆసక్తి చూపడం లేదని ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికర విషయం బయట పడింది. దేశవ్యాప్తంగా 225 జిల్లాలోని 25 వేల మంది ఈ సర్వేలో పాల్గొనగా ఈ విషయాలు బయటపడ్డాయి.



 కరోనా వైరస్ టీకా ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వేయించుకుంటారా... కరోనా వైరస్ తగ్గుతుందా అని ప్రశ్నించగా... 61 శాతం మంది ఏకంగా టీకా  వేయించుకోవడానికి ఆసక్తి చూపలేదట. అంతే కాదు టీకా  ఉచితంగా వేస్తాము అని చెప్పినప్పటికీ కూడా అనారోగ్య సమస్యలు దుష్ప్రభావాలు తలెత్తుతాయి అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారట 51 శాతం మంది ప్రజలు. వ్యాక్సిన్ వచ్చే ఏడాది కాదు ఎప్పుడు వచ్చినా తాము మాత్రం వేయించుకోబోము  అంటూ పది శాతం మంది తెలిపారట. అంతేకాదు కరోనా వైరస్ తో సహజీవనం చేస్తామని మరికొంతమంది కూడా అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: