కాంగ్రెస్ పాలితమైన పంజాబ్ రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను తగులబెట్టడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నెహ్రూ - గాంధీ వంశం అని చెప్పుకున్న కుటుంబాలు ఏరోజూ ప్రధాని కార్యాలయాన్ని గౌరవించలేదని, ఇక వారు దేశ ప్రధానిని ఎలా గౌరవిస్తారని, అది వారి డిక్షనరీలోనే లేదని ధ్యజమెత్తింది. ఇదే విషయమై బీజేపీ జాతీయాధ్యక్షుడు అయినటువంటి జేపీ నడ్డా కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

దేశ ప్రధాని దిష్టి బొమ్మను తగులబెట్టిన ఘటనకు రాహుల్ ‌గాంధీయే ప్రధాన కారకుడని, రాహుల్ గాంధీ దర్శకత్వం వహించిన బూటకపు నాటకం వలన పంజాబ్‌ రాష్ట్రంలో ప్రధాని దిష్టి బొమ్మ తగలబడిందని, అయితే, ఇది ఊహించనిది కాదు అని అన్నారు. నెహ్రూ గాంధీ వంశం అని చెప్పుకొనే కుటుంబాలు ప్రధాని కార్యాలయాన్ని ఎన్నడూ గౌరవించలేదు అని ఈ సందర్భంగా దుయ్యబట్టారు.

ఈ విషయమై నడ్డా కాంగ్రెస్ పైన పలు విమర్శలు చేసారు. సిగ్గులేని కాంగ్రెస్ అర్హత లేని నాయకులను కలిగి ఉందని అన్నారు. రాజస్థాన్‌లో దళిత వర్గాల ప్రజలపై జరుగుతున్న దారుణాలను కాంగ్రెస్‌ ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాజస్థాన్‌తో పాటు పంజాబ్‌లో వున్న మహిళలకు అసలు సురక్షితం లేదని అన్నారు. ఇక పంజాబ్ మంత్రులు స్కాలర్‌షిప్ మోసాలకు పాల్పడి విద్యార్థి బంగారు భవిష్యత్తుకు గండి కొడుతున్నారని పేర్కొన్నారు.

ఇకపోతే, నిన్న దసరా వేడుకల సందర్భంగా కేంద్రం ఏర్పాటు చేసిన కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా పంజాబ్‌లోని పలు రైతు సంస్థలు ప్రధాని మోదీ, వ్యాపార వ్యాపార వేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల దిష్టిబొమ్మలను తగల బెట్టిన విషయం విదితమే. పంజాబ్ దేశ ప్రధాని పట్ల ఇంత కోపంగా ఉండటం మిక్కిలి బాధాకరం. ఇది చాలా ప్రమాదకరమైన సూచిక. కాగా.. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహులు గాంధీ బూతద్దంలో చూపించి వక్రీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: