భారత్ ని అంతలేసి మాటలన్నాక కూడా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ట్ ట్రంప్ రాజకీయ జాణతనాన్ని ప్రదర్శిస్తున్నారు. కొద్ది రొజుల్లో అమెరికా ఎన్నికలు జరగనున్నాయి. ఈ కీలకమైన సమయంలో భారత్ కి తన క్యాబినెట్ మంత్రులను ఇద్దరిని  పంపించి రాజకీయ‌ మంత్రాంగానికి తెర తీస్తున్నారు. న్యూఢిల్లీలో అమెరికా మంత్రులు భారత్ రక్షణ, విదేశాంగ మంత్రులతో చర్చలు జరుపుతారని అంటున్నారు.

మరి ఇంత అర్జంటుగా వారు ఇండియాకు ఎందుకు వస్తున్నారు. చర్చల సారాంశం ఏంటి అంటే చాలానే ఉందిట మ్యాటర్. ముఖ్యంగా అమెరికాకు బద్ధ శత్రువు చైనా. దాంతో దక్షిణాసియాలో చైనాను ఒంటరిని చేయాలన్న భారీ టార్గెట్ తోనే ట్రంప్ మంత్రులు ఇద్దరూ అమెరికా నుంచి ఇండియాకు ఫ్లైట్ ఎక్కబోతున్నారు అంటున్నారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ టీ ఎస్పర్  భారత పర్యటనకు రానున్నారని సమాచారం.

వారు భారత్ వచ్చాక రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తో పాటు భారత విదేశాంగ మంత్రి జై శంకర్ లతో చర్చలు జరుపుతారుట. చైనా మొత్తం ప్రపంచానికీ అతి పెద్ద శత్రువు  అని చెబుతారట. నిజానికి చైనా అమెరికాకు అచ్చమైన శత్రువు. సరే ఇపుడు కరోనా తరువాత ప్రపంచానికి కూడా శత్రువు అయింది. మరి చైనా పక్కన భారత్ ని  జత చేర్చి  మరీ నిందించిన ట్రంప్ ఇపుడు ఎందుకు ఇలా తన మంత్రులను పంపించినట్లు అన్నదే చర్చ.

అంటే భారత్ మీద తాను చేసిన వ్యాఖ్యల వ్యతిరేకతను తగ్గించుకునేందుకు కూడా ఈ సడెన్ టూర్ ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారని అంటున్నారు. అదే సమయంలో భారత్ వంటి దేశాలతో కలసి చైనాకు వ్యతిరేకంగా అమెరికా పోరు సలుపుతుందని అమెరికా ఓటర్లకు  తెలియచేయడం ద్వారా చైనా మద్దతు ఉందని భావిస్తున్న తన ప్రత్యర్ధి జో బైడెన్ విజయావకాశాలను చాలా వరకూ తగ్గించాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది అంటున్నారు. చూడాలి ఈ టూర్ వల్ల ట్రంప్ ఎత్తుగడలు ఏ మేరకు ఫలిస్తాయో.




మరింత సమాచారం తెలుసుకోండి: