సాధారణంగా సైనికులు అనగానే ప్రాంతాలకు లేదా మతాలకు అనుగుణంగా పని చేసే అవకాశం ఉండదు. యుద్దంలో  పాల్గొనే సైనికులు అయినా సరిహద్దుల్లో కాపలా కాసే వారు అయినా విపత్తులలో ఆదుకునే వారు అయినా సరే ప్రాంతాలు మతాల వారీగా తమ వారి కోసమో లేకపోతే మరొకరి కోసమో యుద్ధం చేసే అవకాశం ఉండదు, విధులు నిర్వహించే అవకాశం అసలు ఉండదు అనే చెప్పాలి. కాని  బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

అసలు ఏంటి అవి అనేది ఒక్కసారి చూస్తే... ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ లడఖ్ లో చైనా చేసిన దాడిలో ఎక్కువగా ప్రాణాలు కోల్పోయింది బీహార్ సైనికులు అనే ఒక సిల్లీ ప్రకటన చేసారు. ఓట్ల కోసం బిజెపి సైన్యాన్ని దేశ సరిహద్దులను వాడుతుంది అని ముందు నుంచి ఆరోపణలు చేసే వారికి ఈ విషయంతో మరింత స్పష్టత వచ్చింది. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి దేశ సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అనేది నిజంగా దారుణం.

లడఖ్ లో జరిగిన దాడిలో చాలా అనుమానాలు ఉన్నాయి. మోడీ ఇలా వాడుకోవడంతో ఆ అనుమానాలు మరింతగా బలపడ్డాయి అనే విషయం చెప్పవచ్చు. సైనికులు ఏ రోజు కులం మతం చూసే పరిస్థితి ఉండదు. ప్రాణాలు కోల్పోయే సైనికులు తమ మతం కోసమో కులం కోసమో కాదు చనిపోయింది. కేవలం దేశం కోసం... మన దేశం కోసమే వారు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి సైనికులకు  ప్రాంతాలు అంటగట్టారు. దేశ సరిహద్దుల్లో ఎందరో పంజాబ్ సైనికులు  ప్రాణాలు కోల్పోయారు. ఇవి అన్ని గ్రహించకుండా కేవలం ప్రజలను ఆకట్టుకోవడానికి ఇలా స్థాయి  దిగజారి మాట్లాడటం కరెక్ట్ కాదనే భావన వ్యక్తమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: