గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ వాసులకు సహాయం చేయడానికి తన వంతుగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా రాష్ట్రానికి తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కి కేంద్ర ప్రభుత్వ సహాయం అనేది చాలా అవసరం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనితో కిషన్ రెడ్డి కూడా తన వంతుగా హైదరాబాద్ కి ఏదో ఒక విధంగా సేవ చేయాలి అని భావిస్తూ కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకురావడానికి అడుగులు వేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల కొన్ని నిధులను కూడా రాష్ట్రానికి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. డబుల్ బెడ్రూం ఇళ్ళు ఎన్ని ఎక్కువ పంపిణీ చేస్తే.. బీజేపీకి అంత ఎక్కువ లాభం అని ఆయన అన్నారు. ఇళ్ళు వచ్చిన వారి కంటే రాని వారికే ఎక్కువ కడుపు మంట అని అన్నారు.  డబుల్ బెడ్రూం ఇళ్ళ అంశం ప్రాతిపదికనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి అని ఆయన అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ళు, కరోనా, హైద్రాబాద్ వరదలు.. అన్నిటిల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అని మండిపడ్డారు.

దుబ్బాకలో బీజేపీ గెలుస్తోందనటానికి మంత్రి హరీష్ రావు ఫ్రస్టేషనే ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. దుబ్బాకలో నిరుద్యోగులు బీజేపీకి ప్రచారం చేయటాన్ని హరీష్ రావు తట్టుకోలేకపోతున్నాడని ఆయన విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీచేసే అంశంపై పార్టీలో చర్చ జరగలేదని అన్నారు. దుబ్బాకలో పవన్ కళ్యాణ్ ప్రచారం‌ చేసే విషయంలో స్పష్టత లేదని అన్నారు. సిఎంఆర్ఎఫ్ కు విరాళాలవ్వాలని ముఖ్యమంత్రే వ్యాపారవేత్తలకు ఫోన్ చేసి అడుగుతున్నారని, విరాళాలు ఇవ్వాలని సినీ నటులను మంత్రి తలసాని‌ అడిగనందునే .. నాయకులు సైతం విరాళాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అన్నారన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రనికి త్వరలో  విపత్తు నిధులొస్తాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: